వినాయక వ్రతము
15
శ్లో. గౌరీపుత్ర నమస్తేస్తు శఙ్కర ప్రియనందన,
గృహాణార్ఘ్యం మయాదత్తం గన్ధపుష్పాక్షతైర్యుతమ్. 1
శ్లో. గజవక్ష నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక,
భక్త్యా పాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన. 2
శ్లో. అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణవరపూజిత,
గృహాణాచమనం దేవ తుభ్యం దత్తం మయా ప్రభో 3
శ్లో. దధిక్షీరసమాయుక్తం మథ్వాజ్యేన సమన్వితం,
మధుపర్కం గృహాణేదం గజవక్త్ర నమోస్తుతే. 4
________________________________________________________________________________________ 1. ఓ పార్వతీపరమేశ్వరుల ముద్దుబిడ్డఁడా! నీకు మ్రొక్కెదను,గంధము, పువ్వులు, అక్షతలతోఁ గూడినయర్ఘ్యము(చేతులకు నీళ్లను) నొసఁగెదను. గ్రహింపుము.
2. ఓసకలజనులకోర్కుల నొసఁగు గజముఖుఁడా! నీకు నమస్కరించెదను. నేను భక్తితో నొసంగిన పాద్యమును (కాళ్లకునీళ్లను) గ్రహింపుము.
3. దిక్కులేనివారికి ప్రాపా, సర్వము 'నేనెఱిగినవాఁడా ! దేవతాశ్రేష్ఠులచే పూజితుఁడా! ఓప్రభూ! ! ఓదేవా ! నేనాచమనీయమునిచ్చెదను. పుచ్చుకొనుము.
4. ఓయేనుఁగుమోము దేవరా ! నీకు నమస్కారము. ఆవుపాలు పెరుగు నెయ్యి తేనెలతోఁ గూడిన మధు పర్కము నొసఁగుచున్నాను. దీనిం బుచ్చుకొనుము.