158 వ్రతరత్నాకరము
గలదు.' ఇట్లు భర్తచెప్పిన నామె “ఆర్య! కామేశ్వరి యెటుల తృప్తినొందును. ఎటుల నాపద దాటించును.” అనగా నా మహర్షి యిటుల చెప్పెసు. "ప్రియా మొదట పూజావిధానము నెరుకపరచెదను వినుము. “పూర్వకాలమున సుద్యుమ్నుఁడను బ్రాహ్మణుని యింట రంజకయనుపేరితో పార్వతి యుదయించెను. ఆమె యతనియింట పెరుగుచు యౌవన యాయెను. అట్టితరి “ఈమె సౌందర్యమునకుఁ దగినభర్త ముల్లోకములను గానరాఁడే" యని విచారించెను. ఇటులు విచారించుచున్న తండ్రితో రంజక "తండ్రీ నా కాకాలకఁఠుఁడే భర్తకాని యన్యుఁడు కానేరఁడు.” అని చెప్పి శివునే తలచుచు ఊరకుండెను. ఆమె తండ్రి గూడ ఫాలలోచనునే తలచుచు ఊరకుండెను. అంత నొకనాఁడు నంది నెక్కి ప్రమథులు వెంటరా నాపశుపతి విఱునగవు మొలకలెత్త రంజకయున్న ప్రాంతమునకు వచ్చి ఆమెకరము గ్రహించి తన వాహనముపై నెక్కించుకొనెను. అటు లావృషభము నధిష్ఠించి నంజక యిటు లనెను. ఓ బ్రాహణా నీవు ఆశ్చర్యము నొందితివి. నే నిపు డీపశుపతియింటికి పోవుచున్నాను. నావంటిబొమ్మ నొకదానిని చేసి నీయింట ప్రతిష్ఠించి పూజింపుము, దాన నీకోరిక లీడేరును. వమానవుఁడు నన్ను కామేశ్వరియను పేర పూజించునో వాని కఖిల అభీప్సితముల స్థిరముగా నొనగూర్చెదను.
నాప్రతిమాపూజ యెటులు చేయవలయునో యిక చెప్పెదను శ్రద్ధగా వినుము. గంధము పూవులు మొదలగు ద్రవ్యములచే నలంకరించి కలశమును స్థాపనము చేయవలయును.