157 శ్రీఇష్టకామేశ్వరీలక్ష్మీ వ్రతము
లోకపావనీ, పూజాం శామేశ్వరీం దివ్యాం కృత్వా తత్రవిధానతః 34. స్వదేహే కృతబాధాభిర్ముక్త్యా దృఢతనుర్బభౌ పతిశుశ్రూషకారీచ జపశీలాభవత్తతః. 35. తస్మాత్కామేశ్వరీం, దివ్యాం పూజాం కుక్యుత్యదుత్తమాః, తేషాం రోగా వినశ్యంతి సంపదశ్చ భవంతిహీ. 36. పుత్రపౌత్రాశ్చ వర్ధంతే సర్వసౌభాగ్య కారకాః, అంతే కైవల్యమాయాంతి శివాశివ కృపాకరః 37. ఇతి శ్రీదేవీరహస్యే కామేశ్వరీ వ్రతకథా సంపూర్ణా.
శ్రీఇష్టకామేశ్వరీ వ్రతకథ
పూర్వ మొకానొకప్పుడు పవిత్రురాలైన అహల్య ముదిమినొందినదై పలురకముల రోగములచే నాక్రమింపబడిన దాయెను. చెడుకలల కనుచుండెను. దుఃఖముచే దీనురాలాయెను. ఎల్లవేళల శారీరక బాధయు మానసిక వేదనయు నామెను పీడించుచుండెను. అంత ఈబాధ సహింపలేని యాపతివ్రత యగు నహల్య చదువుల నెఱిగి స్నానము జపము శుచియై ఒనరించుచు శాంతి ధైర్యముగలిగి మంత్రములను, యంత్రముల చక్క నెఱిగియున్న మునిశ్రేష్ఠుడును తనపతియగు గౌతము జేరి “మహాప్రభో! స్వామీ! నాయీరుజను, పీడను నెటులయిన పోగొట్టుము. ఈ నాయస్వస్థతవలన నీ పరిచర్య చేయలేకున్నాను.” అని యిటుల మొర పెట్టుకొనిన భార్యను జూచి గౌతముఁ డి ట్లుపదేశించెను. “కర్తృరహితయు లోకేశ్వరియు నగు కామేశ్వరిని మనమిరువురమును పూజింతము. ఆమె యాపూజవలన తృప్తినొందినదై నీ ఆధివ్యాధుల మాన్ప