14
వ్రత రత్నాకరము
భక్తాభీష్టప్రదం తస్మాద్ద్యాయేత్తం విఘ్ననాయకమ్. ధ్యాయేద్గజాననం దేవం తప్తకాఞ్చనసన్నిభం, చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితమ్.
శ్రీవరసిద్ధివినాయకం ధ్యాయామి
శ్లో. అత్రాగచ్ఛ జగద్వన్ద్య సురరాజార్చితేశ్వర,
అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్భవ. 1
శ్రీవరసిద్ధివినాయకం ఆవాహయామి,
శ్లో. మౌక్తికైః పుష్పరాగైశ్చ నానారత్నైర్విరాజితం,
రత్న సింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్. 2
శ్రీవరసిద్ధివినాయకాయ ఆసనం సమర్పయామి.
________________________________________________________________________________________ బులను ధరించినవాడును, భక్తుల కోరికలు నొసఁగువాఁడును, బంగారుచాయగలవాడును, గొప్ప మేనుఁగలవాఁడును సకల భూషణములఁ దాల్చినవాడు నైన వరసిద్ధివినాయకుని నేను మనసున ధ్యానించుచున్నాను.
1. లోకములచే పొగడఁదగినవాఁడవు, ఇంద్రాది దేవతలచే పూజింపఁ బడినవాఁడవు, దిక్కు లేనివారికి దిక్కువు, అన్నిటిని దెలిసినవాఁడవు, పార్వతీ దేవికిఁ బుత్త్రుడవునైన ఓసిద్ధివినాయకా! నిన్ను (ఈబింబమునందు) ఆవాహనము చేయుచున్నాను.
2. ఓవినాయకా ! ముత్యములు పుష్యరాగములు నీలములు పచ్చలు వజ్రములు గోమేధికములు మొదలగు మణులుచెక్కిన సొగసైన ఆసనము నొసఁగుచున్నాను. దీనిని నాప్రీతికై కైకొనుము.