Jump to content

పుట:వ్రత రత్నాకరము, ప్రథమ భాగము.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

వ్రత రత్నాకరము

సమర్పయామి, మహాగణాధిపతయే నీరాజనం సమర్పయామి, నీరాజనానన్తరం ఆచమనీయం సమర్పయామి.

వక్రతుండ మహాకాయ కోటిసూర్యసమప్రభ, అవిఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. మహాగణాధిపతయే నమః, మంత్రపుష్పం సమర్పయామి. మహాగణాధిపతయే నమః, ఆత్మ ప్రదక్షిణనమస్కారాన్ సమర్పయామి. సర్వోపచారపూజాః సమర్పయామి, యస్య స్మృత్యాచ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు, న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వన్డే తమచ్యుతం, మన్త్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప, యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే.

అనయా పోడశోపచార పూజయా భగవాన్ సర్వదేవాత్మకః శ్రీమహాగణాధిపతిః సుప్రసన్నో వరదో భవతు. (అని అక్షతలు పువ్వులతో గూడ నీళ్లు విడువవలసినది ) మను ఇష్ట కామ్యార్థ ఫలసిద్ధి రస్తు.

గణాధిపతిప్రసాదం శిరసాగృహ్ణామి (అని చెప్పి అక్షతలు పుష్పములు శిరస్సున ధరింపవలసినది.)

ఈప్రకారము ప్రతివ్రతమునకును మొదట వినాయక పూజ చేయవలయును.

తదంగ త్వేన [1] (ఫలసిద్ధి వినాయక) ప్రాణప్రతిష్ఠాపనం కరిష్యే.


  1. మన మేదేవత నుద్దేశించి వ్రతముఁ జేయఁబోవుచున్నామో, ఆ దేవతా నామమును ప్రాణ ప్రతిష్టాపనమునందు ముందుగాఁ జేర్చవలయును. 'వరలక్ష్మీ దేవతా ప్రాణ ప్రతిష్ఠాపనం, సరస్వతీ దేవతా ప్రాణ ప్రతిష్ఠాపనం' అని చెప్పవలయును.