Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వేటూరి ప్రభాకరశాస్త్రి

61


ఏకశిలానగరము

ఇందు వర్ణితము లయిన విషయములఁబట్టి యేకశిలానగరస్థితి కొంత వఱకు గుర్తింపనగుచున్నది. నేఁడది పాడుపఱుపఁబడి పరిఖ, ప్రాకారరేఖ, పెద్దగవని, కేశవ శ్రీ స్వయంభూనికేతనముల నేలమట్టములు మొదలగు శిథిల చిహ్నము లల్పముగాఁ గలదై పల్లేరుపాడుగా నున్నదిగాన, దాని యానాఁటి సన్నివేశముల గుర్తించుట కీ గ్రంథము గొంత తోడ్పడును. ఆ యీ విషయము నించుక విస్తరింతును.

ఏకశిలానగర ప్రాకారమునకు వెలుపలనుండి టిట్టిభమంచనశర్మలు సూర్యోదయకాలమునఁ జూడఁగా నగరములోని సౌధాగ్రములు గానవచ్చినవి. వా రిర్వురును దొలుత వెలిపాళెమునఁ బ్రవేశించిరి. వెలిపాళెమనఁగా నగరప్రాకారమునకును బరిఖకును వెలితట్టున నున్నగూడెము. ఆవెలివాడలోఁ గట్టకడపట మేదరవాడగలదు. అక్కడ కటకుటీర విలాసినీవర్ణనము కొంత. అటపోవ నొక చండాలంగన ఋతుస్నానార్థమై వచ్చుట గానవచ్చెను. దీనిఁబట్టి వెలిపాళెము నగరముచుట్టును గలపరిఖకు వెలుపల దాని నంటి చుట్టియేని లేక పెద్దగవనిప్రాంతములం జుట్టియేని కలదనియు నందు దుట్టతుద మేదరవాడకలదనియు నొకప్రక్క చండాలవాటి గలదనియు చండాలస్త్రీ యగడ్త నీటిలో ఋతుస్నానముచేయ నేతెంచెననియుఁ దెలియనగును. అట కొంత చనఁగా నొక కర్ణాటి కుండతో నీళ్ళఁగొంపోవుట గానవచ్చెను. ఆ స్త్రీ నీళ్ళనగడ్త నుండియే కొనిపోవుచుండవచ్చును. దీనిఁబట్టి యగడ్త జలసమృద్ద మనియు, నాజలము వెలిపాళెమువారి స్నానపానాదులకుఁ దగియుండెననియుఁ దెలియ నగును. ఆవలవారు హట్టమార్గమునఁ జనిరి. హట్టమార్గ మనఁగా నంగడివీథి నగరములోనికిఁ బోవుముఖ్యమార్గము. అందు 'మైలసంత' గలదు. నగరము లోపాళెమున 'మడిసంత'యు, వెలిపాళెమున 'మైలసంత' యు నుండెడివి గాఁబోలును. మడిసంతలో నున్నతజాతులవారు గొనదగిన వస్తువులు (కూరగాయలు మొదలగునవి) యుండెడివి గాఁబోలును. మైలసంతలో నిమ్నజాతుల వారికిఁ గావలసిన వస్తువు (మత్స్యమాంసాదు) లుండెడివి గాఁబోలును. ఈ మైలసంత యేకశిలానగరముననే కాక విద్యానగరమందును గలదు.[1]

మైలసంతలో 'సుసరభే'త్తను మందు నమ్ము మందులదానిని మనకథా

  1. దక్షణహిందూదేశ శాసనసంచయము 4 వాల్యుం నెం. శాసనము చూచునది.