వేటూరి ప్రభాకరశాస్త్రి
59
మృదుచలదలకాన్తా ముగ్ధపుంభావలీలా
మభినయతి హరిద్రాపేషణచ్ఛద్మనైషా.
స్ర॥ పరిపోటీఖర్వఖర్జూపరతిసమయసం
భ్రాంతసంభోగభంగిన్.
(క్రీడా.110 ప)
గ్రంథపాతములు
ఇప్పుడు ప్రకటిత మయిన యీ గ్రంథమున గ్రంథపాతములు పెక్కులు గలవు. తంజావూరిలైబ్రరీలో నున్న దీని మాతృక యగుతాళపత్రప్రతి వ్రాఁతలోనే పెక్కు గ్రంథపాతము లున్నవి. దాని మాతృకలోఁగూడ నవి యుండవచ్చును. ఈ కృతి యవతరణిక యెంత గ్రంథముగలదో? అది యిందు లేదు. కాని, యందలి పద్యమొక్కటి మాత్రము ప్రబంధరత్నాకరమునఁ గలదు. దాని నిందింతకుముం దుదాహరించితిని. క్రీడా. 176వ పద్యము 'అందుకొని.... గొమలిఱేకు' తరువాత నొక గ్రంథపాతమున్నట్టున్నది. మాతృకలో నట్టు గానరాదు గాని, గ్రంథసందర్భమునుబట్టి చూడఁగా గొంతగ్రంథలోప మున్నట్టు తోఁచును. ఇట్లే 'అనిన గాంధర్వి' 216 వచనమునకుఁ బూర్వము కొంత గ్రంథపాతము గలదు. తంజావూరిఁ లైబ్రరీలోనే వేఱొక తాళపత్రగ్రంథ సంపుటమున నీ గ్రంథపాతము లోనిదిగాఁ దలఁపఁదగినపద్య మీక్రిందిది గానవచ్చును.
సీ॥ తివిరి గోదావరీతీరదేశంబున
విధవల విషయించె వీనితాత
కాకొల్ని తిరునాళ్ళఁ గలమాసకమ్మల
వెదకి పొందినవాఁడు వీనితండ్రి
వరుసఁ జందురగిరి వాడముండల కెల్ల
వెఱపు దీర్చినవాఁడు వీనియన్న
గర్భ మాదిగ నోరుఁగంటియక్కలవాడ
వలతియై తిరుగాడువాఁడు వీఁడు
ఆ॥వె॥ అనఁగఁ దాత తండ్రి యన్నయుఁ దానును
పొగడు నెగడు నట్టి పుణ్యుఁ డితఁడు
.................................................................
...............................................................