58
క్రీడాభిరామము
లుద్దృతములై గానవచ్చుచున్నవి. దొరకిన రచనములఁబట్టి చూడఁగా నాకవీశ్వరుని కవిత యతిప్రశస్తమని తలఁపఁదగియున్నది. క్రీడాభిరామపద్యములకు మూలకల్పము లనఁదగిన శ్లోకములు నాకుఁ గొన్ని గానవచ్చినవి. పెదకోమటి వేమారెడ్డిగారు రచియించిన సాహిత్య చింతామణిలోఁ గానవచ్చుటచే నా శ్లోకములు ప్రేమాభిరామములోనివి గావచ్చునని నమ్మవచ్చును.
ఉపేంద్రవజ్ర॥
పరారి సందర్శితసన్నివేశా
పరుత్పరాభూతపయోజకోశౌ
ఇహైషమ పాళ్ళఫలోపమానౌ
స్తనౌ కియన్తౌ పురతో భవేతామ్.
చ॥ దొరసెము (?) నందు చుట్టుకొని తోరణకట్టే నురోవిభాగమున్.
( చూ. క్రీడా. 288 ప)
ఆర్యా.
తరుణం సర్షపశాకం
నవౌదనం పిచ్చిలాని చ దధీని
స్వల్పవ్యయేన సుందరి
గ్రామ్యజనో మృష్ట మశ్నాతి.
ఈ శ్లోకము వృత్తరత్నాకర వ్యాఖ్యలో నుదాహృతమయ్యెను. దీని కీ క్రిందిపద్య మనుకృతియే.
గీ॥ శీతకాలంబు కడి మాడ సేయఁ గుడుచు
భాగ్యవంతుండు ఱేపాడి పల్లెపట్లఁ
గొఱ్ఱ (గ్రొత్త) యోరెంబు నిగురావకూరతోడఁ
బిచ్చిలం బైన నేతితోఁ బెరుగుతోడ
(క్రీడా.56ప)
'కొఱ్ఱయోరెంబు' అనుచో 'క్రొత్తయోరెంబు' అని కవిపాఠమై యుండవచ్చును
మాలిని॥
పృథులజఘనభారం మన్దమాన్దోలయన్తీ
ప్రచలితకుచకుంభా సంభ్రమత్కర్ణపూరా