Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

56

క్రీడాభిరామము

మాత్రమే సమగ్రముగానో అసమగ్రముగానో దొరకినవి. వీనిలో నెందుఁగాని క్రీడాభిరామపద్యములు గానరావు.

శ్రీనాథునికిఁ జాలఁ దర్వాతివారిలో చిత్రకవి పెద్దన, ముద్దరాజురామన, గణపవరపు వేంకటకవి యనువారి గ్రంథములు సర్వలక్షణసారసంగ్రహము, కవిసంజీవిని, ప్రయోగరత్నాకరము అనునవి దొరకియున్నవి.

ఆఱేండ్లక్రిందట మైసూరుదొరతనపువారియొద్దనుండి కె.వి. లక్ష్మణరావుగారు కొన్ని తెలుఁగుగ్రంథములను సాహిత్యపరిషత్తునకై కొనిరి. చిత్రకవి పెద్దన సర్వలక్షణ సారసంగ్రహము, హరిభట్టు నృసింహపురాణము మొదలగునవి యవి యాంధ్రసాహిత్యపరిషద్భాండారమున నిప్పుడున్నవి. మైసూరు నుండి రాఁగానే వాని నేను గడముట్టఁ బరిశీలించితిని. వానిఁ గూర్చి కొంత లఘుసూచిక వ్రాసికొంటిని. చిత్రకవి పెద్దనకృతిలో క్రీడాభిరామపద్యమున్నట్టు నేను వ్రాసికొన్న సూచికలోఁ గానరాదు. అం దా పద్యములు లేవనియే నా నమ్మిక. ముద్దరాజురామన గ్రంథమునను, గణపవరపు వేంకటకవి గ్రంథముననుగూడ క్రీడాభిరామపద్యములు వల్లభరాయనిపేర నుదాహృతము లగుట నాకుఁగానరాలేదు.

శ్రీధరచ్ఛంద మింతవఱకు నా కెక్కడను గానరాలేదు. ప్రసిద్ధగ్రంథాలయములం దెందును దాని యునికి తెలియరాలేదు. రంగరాట్ఛందస్సు మొదలగు లక్షణగ్రంథములందు శ్రీధరచ్ఛందములోనివిగా నీ క్రిందిపద్యములుదాహృతము లయ్యెను.


క॥ మయరసతజభగణంబులు
     నయధనభయ విలయబంధనశ్రీతేజో
     జయములు క్రమమున నొసఁగును
     ప్రియసరసవచోభిరామ పిన్నయసోమా!

క॥ సురనరతిర్యగౌరవ
     వరగతులగుభూసురాదివర్గాక్షరముల్
     గురులఘువులు నరసురగతు
     లరిరాయ విఫాల! సోమ! యవనీపాలా!