Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48

క్రీడాభిరామము


ఉ॥ చూడఁగ నల్పుగాని పరిశోభితదివ్యకురంగనాభ మే
      జాడను? రాజయోగ్య మగుజవ్వని నల్లనిమేనిసంచు తో
      డాడఁగ రాదుగా! రతిరహస్య మెఱింగినఁ జిత్తసంభవ
      క్రీడలఁ దేరి చూడవలె గేదగిగంగి విచిత్రవైఖరుల్.

ఉ॥ భూతలమందు ధాతకు నపూజ్యత గల్గెను రెంటమూఁట భా
      గోతులబుచ్చిగాని కొక కొంచె మనంగగృహంబు సేయమిన్
      భీతకురంగనేత్ర యగుపెండెలనాగికి మర్మజాతసం
      ఘాతము లుంచినందుకును గంగిని నల్పొనరించినందుకున్.


అను పద్యములు శ్రీనాథకృతములుగాఁ వినఁబడుచున్నవి. కాని, యీ పద్యములు తురగారామకవిగ్రామణి వని యీ క్రిందిపద్యము నిరూపించుచున్నది.


ఉ॥ పెండెలనాగి కొప్పుపయిఁ బెద్దికటిస్థలి గంగిగుబ్బచ
      న్గొండల నుండురామకవికుంజరుహస్తము క్రిందు సేసె హా
      పండక బంటుపల్లి; యది పండిన నీకసుమాలధారుణీ
      మండలనాథుఁ బోలునొకమానవమాత్రుని వేఁడఁబోవునే!

      మఱియు,

ఉ॥ రాతిరి నేను పస్తు హయరత్నము పస్తు కవీంద్రగాయక
      వ్రాతము పస్తు........................................................................
      ..............................................................................................
     లేఁతమిటారి నావయసులేము యుప-కుఁ బస్తు భూవరా!


ఇత్యాది పద్యమును గూడఁ గొందఱు శ్రీనాథకృత మందురు గాని యదియు రామకవికృతమే యని పలువుర పారంపర్యపు వినుకలి, ప్రతికూలప్రమాణములు గలవాని నిట్టివానిని విడనాడవచ్చును. కాని, శ్రీనాథునివిగా వినఁబడుచున్న చాటుధారల నన్నింటిని శ్రీనాథ శత్రువులెవ్వరో కల్పించినా రనువారిస్వకల్పితపువాదమును నేను సంభావింపఁజాలను.

మఱియు" ఎట్టిజారుఁడయినను దన దుశ్చారిత్రమును దానే ప్రకటించుకొనుచుఁ బద్యముల వ్రాయునా? కావున, శ్రీనాథుఁడు జారుఁడను నపవాదమాతని కాలములో లేక యాతని యనంతరము చాలఁ గాలమునకుఁ బుట్టియుండునని తలఁపవలసియున్నది" అని యొక యాక్షేపముగలదు. ఈ యాక్షేపమునకు లోకజ్ఞత చక్కఁగా సమాధానము నొసఁగఁగలదు. లోకమున విషయ వాసనల జయింపగలవా రేకాలమునఁ