Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వేటూరి ప్రభాకరశాస్త్రి

37

“శ్రీనాథుఁడు శఠకోపజియ్యరుమీఁద చెప్పినది. తన యింటి యంచుమఱుగుతావులో జియ్యరు వుండగా అక్కడికి వక స్త్రీ వస్తే దాని పనులు వాడు చేసుకున్నట్లు చూచి శ్రీనాథుఁడు తెల్లవారి చెప్పినది” (ఇది బ్రౌను దొరగారి వాక్యరచన)


చ॥ ఇంగలమంచు వచ్చి యడియే నని కొత్తమసాని మ్రొక్కఁగాఁ
      గొంగు బిరాల్నఁ బట్ట తిరుకొం గటు దీసి జలారిచెంతనే
      వంగఁగఁ బెట్టి యోనిఁ దిరువట్టలఁ గొట్టగఁ జాలుఁ జాలు నీ
      ...............లటంచు నిన్ను మఱి తిట్టెనుగా శఠకోపజియ్యరూ!

దీని పోలికను చౌడప్ప యొక పద్యము చెప్పెను.

ఉ॥ గండము దప్పె నంధ్రకవిగానికి నిన్నటిరేయి పుష్పకో
      దండునికేళిఁ గూడకయ తద్దయు నిల్చితిఁ గాని యయ్యయో
      బండరువారి పాపికిని బైటిపసారమె కాని యందులోఁ
      బుండట యెల్లవంకఁ జెడిపోదుఁగదా విషయింపఁ బోయినన్

ఉ॥ జంగమురాలిఁ బట్టి యొకజంగము వంగఁగఁ బెట్టి యోనిలో
      లింగముఁ బెట్టి క్రుక్కి యదలించుచు నొక్కొకతాఁకు తాఁకినన్
      లింగ ! నమశ్శివాయ! గురులింగ! మహేశ్వర! జంగమయ్య! యో
      యంగజభంగ! సాంబగురుఁడా! యనుఁదాఁకినతాఁకుతాఁకుకున్.

ఉ॥ గోష్పదరూపమై మిగులఁ గోమలమై గణుతింపరానిదై
      శష్పవిహీనమై నునుపు చాలఁగఁ గల్గి ద్రవం బపారమై
      పుష్పిణి యై నీభగము పుణ్యమునన్ భుజియింపఁగల్గె వా
      స్తోష్పతికైన నో ద్రవిడసుందరి! నిన్ను వచింప శక్యమే?

చ॥ వడిసెల చేతఁ బూని బిగివట్రువగుబ్బలఁ బైఁట జాఱఁగా
      నడుము వడంకఁగాఁ బిఱుదు నాట్యము సల్పగఁ గొప్పవీడఁగా
      దుడదుడ మంచెయెక్కె నొకదొడ్డమిటారపుఁ గమ్మకూతురున్
      దొడదొడ మంచమెక్కె నొక దొడ్డమిటారపు రెడ్డికూఁతురున్.

శా॥ అక్షయ్యం బగు సాంపరాయని తెలుంగాధీశ కస్తూరికా
      భిక్షాదానము సేయురా సుకవిరాడ్ బృందారక శ్రేణికిన్
      దాక్షారామచళుక్య భీమవర గంధర్వాప్సరోభామినీ
      వక్షోజద్వయకుంభికుంభములపై వాసించుఁ దద్వాసనల్