36
క్రీడాభిరామము
నా కన్యత్ర చేకూరినది. తనచేతి వ్రేలిగోరు విఱిగిపోఁగా శ్రీనాథుఁడు చెప్పుకొన్న చాటువిది.
సీ॥ నీలాలకాజాలఫాలకస్తూరికా
తిలకంబు నేమిట దిద్దువాఁడ
నంగనాలింగ నానంగసంగర ఘర్మ
శీకరం బేమిటఁ జిమ్మువాఁడ
మత్తేభగామినీవృత్తస్తనంబుల
నెలవంక లేమిట నిల్పువాఁడ
భామామణీకచాభరణశోభిత మైన
పాపట నేమిటఁ బాపువాఁడ
గీ॥ ఇందు సఖులను వే ప్రొద్దుఁ గ్రిందుపఱిచి
కలికి చెంగల్వఱేకుల కాంతిఁ దనరి
................................. అహహ!
పోయె నా గోరు! తనచేతిపోరు మాని.
క్రీ. 1830 ప్రాంతములందు 'ఆంధ్రభాషా మహావిద్వాంసు’లని, 'సర్వజ్ఞు' లని నాటి మహావిద్వాంసుల చేతనే కీర్తింపఁబడిన మహనీయులు సి.పి. బ్రౌనుదొరగారు కథావివరణములతో శ్రీనాథుని చాటుధారలను గొన్నింటిని సేకరించిరి. అందుఁ గొన్ని వివరణములు పద్యములు వారి స్వహస్తాక్షరములతో నున్నవి. వాని నిక్కడఁ జూపు చున్నాఁడను.
శ్రీనాథుని వీథినాటకములోనిదని (ములుపాక) బుచ్చయ్యశాస్త్రి ఒక చరణమే చదివినాఁడట.
'పయట కొం గిఱుకుగుబ్బలసందిఁ బడి బండి
గురిగింజదండతో సరసమాడ'
శ్రీనాథుని వీథినాటకములోని వని యీ క్రింది రెండు పద్యములు నుదాహరింపఁబడినవి.
ఉ॥ మీన విలోచనంబులును మీఁటిన ఖంగనుగుబ్బచన్నులున్ (క్రీడా. 104 ప. చూ. )
ఉ॥ కందుకకేళి సల్పెడు ప్రకారమునన్ (క్రీడా. 82 ప. చూ.)