32
క్రీడాభిరామము
ఇందు శ్రీనాథుని కవనంపుఁబెంపు, నిరంకుశత, భావోద్రేకము దైవాఱుచున్నవి. [1](వీరభద్రుడు) కుబేరుని, అగ్నిని, చంద్రుని, ఇంద్రుని తిట్టుచున్నాఁడు. 'ఏమి గుడువంగ వచ్చినా' రనుటలో భుజించుట యనునుచితార్థమున్నను వేఱొక యశ్లీలార్థమును వ్యక్తమగుచునే యున్నది. 'ఈ యాగమునకు' అనుచో 'నీ ఆగమునకు' అనికూడా ఛేదమున్నది. 'అల్లరీ ఆగమూ' అని నానుడి. 'తమ యాండ్ర త్రాళ్ళు తెగవె' ఇట్టి పలుకు ములుకులు సాధారణ కవుల రచనలలో సాగునవి గావు. ఈ పద్యము చదివినప్పుడెల్ల శ్రీనాథుఁడు గవిసార్వభౌముఁడై నాకుఁ గన్పట్టుచుండును. 'కుడుచు' ధాతువును భుజించు నర్థమున నీతఁడు ప్రయోగించుటఁ జూపి యిక్కడ నన్నెవ్వరే నాక్షేపింతురు గాఁబోలును. 'ఏమి గుడువంగ వచ్చినా, రనుటలో రెండవయర్థ మెంత యశ్లీలమైనను నది [2](వీరభద్రుఁడు దక్షాధ్వర ధ్వంసములోఁ జెలరేఁగి తిట్టెడు తిట్టులలో నిక్కడ సొంపునే సంపాదించుచున్నది. అపుడు వీరభద్రుఁడు సభ్యమైన, సరసమైన, హితోక్తు లాడుటయే యస్వరస మగును.)
మఱియు హరవిలాసము సప్తమాశ్వాసమున మాయాకిరాతుఁ డర్జునుని దిట్టుటలో
క॥ మండెడుబలునారసమున
గుండియ వగులంగ నేసి కూల్చితి దీనిన్
వెండి ప్రయోజన మేదీ
రండాసుత ! దీనిపై శరము నిగుడింపన్ (హర. 7-53)
మఱియు శివరాత్రిమాహాత్మ్యమున:
గీ॥ అనుచు విప్రుండు దమకించి యంటుకొనియె !
సమ్మతించియ యుండె నా చంద్రవదన
శూకలాశ్వంబు నసరేఁపఁ జొచ్చినప్పు
డనుమతింపదె యత్తళు వైనబడబ. (శివరాత్రి. 3-69)
సీ॥గీ॥ ఎట్లు కనుఁ బ్రామి వచ్చునో యింటివారి
నెట్లొ (చీకటి నొం)టి మై నింటి కరుగు
నతివ పగలైన మా పైన నతనితోడ
నిచ్చ నొకసారి గావించు నిథువనంబు. (శివరాత్రి. 3-114)