Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30

క్రీడాభిరామము


               యె....................................కుండ
      దర్పంబు సడలింపు తరుణేందుశేఖర
               యొరసి యాశాభిత్తు లొలియకుండఁ

గీ॥ దివియు వేగ మహాదేవ ధిక్కరింపు
     ముడుపు మహిరాజకంకణ యడఁపు రుద్ర
     వాల్పు ఖట్వాంగపాణి (వదల్పు మభవ?)
     మోహనంబైన నీమహీమేహనంబు.

చ॥ అనినఁ బ్రసన్నుఁడై కహకహధ్వని నవ్వి లలాటనేత్రుఁడి
      ట్టను భువనంబు లెల్ల వినునట్లుగ నోపరమర్షులార! యో
      యనిమిషులార! తక్కుఁగల...................................
      యనుపమదివ్యలింగ మిది యర్చన కర్హమునేఁటినుండియున్.

క॥ లింగార్చనాపరుం డగు
     మంగళహృదయునకు నేను మక్కువతోడన్
     సాంగత్యము గృప సేయుదు
     నంగీకృత.......................తోన్.


వ. అని శంభుండు నిఖిల బ్రహ్మాండ సంభార కుక్షింభరియగు నిజమహాలింగ స్తంభంబు స్తంభింపం జేసె నప్పుడు ముకుళిత హస్తారవిందులై దేవదారు వన దివ్యాశ్రమస్థులగు.......... బులు జనియించి........ పాహిభూషణుని బహువిధంబుల భక్తి విశేషంబుల భజియించిరి. భోగమోక్షంబులు గాంచిరి..... వనవిహారంబు ... ఫలసిద్ధ యగును.” మఱియును :


శా॥ కాంచీకంకణ తారహార కటకగ్రైవేయభూషావళుల్
      లంచం బిత్తురు దూతికాతతికి లీలన్ బెండపూఁడన్ననిన్
      బంచాస్త్రోపముఁ దారతార కవయన్ బ్రార్థించి లోలోపలన్
      బంచారామములందుఁ బల్వెలపురిన్ బ్రౌఢేందుబింబాననల్.
                                                                   (భీమ.1-77)

మఱియును :

సీ॥ ముడువంగ నేర్తురు మూల దాపటికి రాఁ
               జికురబంధము లీఁగ జీరువాఱఁ
      బొన్నపువ్వులఁ బోలుపొక్కిళ్ళు బయలుగాఁ