26
క్రీడాభిరామము
డందు కొడఁబడె” ననరాదఁట : పల్లెగ్రామములలో రైతు లిద్దఱు దగవులాడుకొనుచున్నప్పుడు కరణము కాఁపులు మధ్యస్థ్యము చేసి యిద్దఱకును కష్టనష్టములు కలుగకుండఁ గుదుర్చు రాజీపద్ధతియా యిక్కడ యోజింపవలసినది? వల్లభరాయఁడు కవియై, గ్రంథకర్తయై యున్నపుడు కొన్ని పద్యము లయినను శ్రీనాథునిచేఁ జెప్పించుకొనుట నీచపుఁబని కాదు గాఁబోలును గ్రంథ మామూలాగ్రము శ్రీనాథుని పేరిని బట్టియిచ్చుచున్నదని గదా నేను జెప్పుచున్నది.
శ్రీనాథుఁ డిట్టి రచన చేయునా?
క్రీడాభిరామమున 'సుసరభేత్తు' 'కమఠావతారంబు' 'ఈమణి' 'పూవుఁబోఁడులు' 'వ్యామగ్రా' హేత్యాది రచనము లసభ్యములై యున్నవి. మహాకవి యగు శ్రీనాథుఁడిట్టి రచనములఁ జేయఁబూను ననుట సంగతమగునా యని సందేహముతోఁచును. ఇంచుక విపులముగా విమర్శించినచో నీ సందేహమునకు స్థానముండదు. సంస్కృతభాషలో భాణములు, ప్రహసనములు, వీధులు కావ్యనాటకాదులకంటెఁ గొంత హెచ్చుగాఁ బచ్చిగాఁ గాముకీకాముక వ్యాపారవర్ణనములతో వెలయుచున్న వన్నవిషయము సంస్కృతభాషాపాండిత్యము గల సరసులకుఁ జక్కఁగా నెఱుక కెక్కియుండునదే. బహుప్రాచీను లగు శూద్రక వరరుచీశ్వరదత్త శ్యామిలకాదులును, శ్రీనాథుని సమకాలమువారగు డిండిమవామనభట్ట బాణాదులును రచించిన భాణములందుఁ బచ్చిపచ్చిగా వర్ణనలు హెచ్చుగాఁ గానవచ్చును. మచ్చునకుఁ గొన్ని పద్యము లిచ్చుచున్నాఁడను.
[1]స్రగ్దర.
ఆక్షిప్తస్రస్తవస్త్రాం ప్రశిథిలరశనాం ముక్తనీవీం విహస్తాం
హస్తవ్యత్యాసగుప్తస్తనవివరవలీమధ్య నాభిప్రదేశామ్
లజ్జాదీనోపవిష్టాం నహి నహి విసృజేత్యేవమాక్రన్దమానాం
శయ్యామారోప్య కాన్తాం సురతసమదయస్యాగ్ర సస్యం గృహాణ.
(శూద్రకుని పద్మప్రాభృతకము. పుట 11)
- ↑ చూ. శ్రీమానవల్లి రామకృష్ణకవిగారు, యస్.కె. రామనాథశాస్త్రిగారు పరిష్కరించిన 'చతుర్భాణి-1922 లోఁ బ్రకటితము.