వేటూరి ప్రభాకరశాస్త్రి
25
పయిసాతవాహనసప్తశతీగాథ కీ పద్యము సరియయిన తెలుగుసేఁత యని నిరూపించుట కధిక ప్రయత్న మక్కఱలేదు. ఝంఝా-వాత- ఉత్తృణితే- గృహే అను పదములకు -ఝంఝా - పవన-ఉత్తృణ - ఆలయములో - అని తెలుఁగుసేఁత, రుదిత్వా - నిస్సహ- నిషణ్ణమ్ - అను పదములకు 'భద్రంబునన్ - మొదలు, నిద్రించుచు నున్న- వఱకు శ్రీనాథసంప్రదాయానుగుణమైన విపులవివరణము- గతపతికాం- వాడ (పాంథ అని పాఠమై యుండును) వనితన్, గర్ణావచః ప్రౌఢిమన్ - శ్రీనాథ రచనాసంప్రదాయానుగుణమైన, యధిక గుణసంపాదకమైన యమూల పదమిది. విద్యుదుద్ద్యోతః - తటిదుద్ద్యోతము, దర్శయతి - చూపున్ - నట్టనడురే - ఆవశ్యక మయిన గుణసంపాదక మయిన యమూలకపదమిది. జలధరాణాం ధారాధర శ్రేణికిన్ - ఝంఝా-ఉత్తృణ-ఉద్ద్యోతపదములు మక్కికి మక్కిగాఁ గూడఁ గలవు. ఇట్లీ తెల్గుపద్యము సాతవాహన సప్తశతీ గాథకుఁ దెలుఁగగుట విస్పష్ట మగుచుండఁగా, సాతవాహనసప్తశతిని శ్రీనాథుఁడు తెలిఁగించుట ప్రఖ్యాతమైయుండఁగా, శ్రీనాథుని కాలముననే క్రీడాభిరామరచనము జరిగియుండుట (శ్రీనాథుఁడును వల్లభరాయఁడును సమకాలమువారు గాన) సునిశ్చితమై యుండఁగా, శ్రీనాథుని యాంధ్రీకరణరీతి) యీ పద్యమునఁ బరిస్ఫుట మగుచుండఁగా క్రీడాభిరామము ప్రేమాభిరామ మను సంస్కృతరూపకమునకు మక్కికిమక్కిగా దెలుఁగునఁ బెట్టఁబడిన ప్రతిబింబము గాదనుట ( ఈ పద్యమునుబట్టి కూడ) యంగీకరించి తీరవలసినదై యుండఁగా నీ పద్యముగాని, యీ పద్యముగల గ్రంథముగాని శ్రీనాథరచితము గాదనువాదమున కాదరువుండునా? నేనీ పద్యమునకుమూలము నిప్పుడు సాతవాహనసప్తశతి నుండియెత్తి చూపితినిగాన యిఁక దీనిని బ్రక్షిప్త పద్యముగాఁ బరిగణించి పరిహరింపవలె నను వాదము బయల్పడఁబోవును గాఁబోలును; వాదమా నీకు వందనము! ఇదివఱకే యిట్టి వాదమొకటి పుట్టి యున్నది. ఈ గ్రంథముతో శ్రీనాథునకు సంబంధము కలదని యంగీకరింప వలసినదే యనియు శ్రీనాథుడు వల్లభరాయని యెడఁగల స్నేహబాంధవముల కలిమిచే నీ గ్రంథరచనమున నాతనికి విశేషముగాఁ దోడ్పడి పెక్కు పద్యములు రచించి యిచ్చియుండు ననియు, శ్రీనాథ వల్లభరాయల యిర్వుర గౌరవమునకుఁగూడ నీ యభిప్రాయము నిర్బాధకమైన దనియును - " "కవి యశోలోభమున వల్లభరాయఁడు విభవ మొసఁగి శ్రీనాథునిచే స్వకర్తృకముగాఁ జెప్పించుకొనుట నీచపుఁ బని గాన వల్లభరాయఁ