Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వేటూరి ప్రభాకరశాస్త్రి

21


      'విద్వజ్జనులు నిన్ను విషయించి వత్తురు' ( నైషధము 6-110)

ఉ॥ గండము దప్పె నాంధ్రకవిగానికి నిన్నటిరేయి పుష్పకో
      దండునికేళిఁగూడకయ తద్దయు నిల్చితిఁగాని యయ్యయో
      బండరువారిపాపికిని బైటిపసారమె కాని యందులోఁ
      బుండట యెల్లవంకఁ జెడిపోదుఁగదా విషయింపఁబోయినన్.

ఈ పై పద్యము శ్రీనాథుని చాటుధార యని సి.పి. బ్రౌను దొరగారు సేకరించిరి.

      'అయ్యగారికి జోహారు లనుచు మ్రొక్కు' (క్రీడా. 186 ప)

      'అయ్యగారికి నమస్కారంబు లని' (శి.మా. 3-38)

      'వేశ్యాజనంబునకు వావివరుస యెక్కడిది' (క్రీడా. 252 ప)

      'వారకాంతాజనమునకు వావి గలదె' (హర. 127)

      'పులుఁగురాయని తాత్కాలపుణ్యభిక్ష' (క్రీడా. 221 ప)

      'పొసఁగ వడ్డించెఁ దత్కాలపుణ్యభిక్ష' (హర. 5-48)

      'పురములోఁ దత్కాలపుణ్యభిక్ష' (భీమ. 3-7)

      'కసటు వోఁవగఁ దోమి కడిగి బోరగిలంగ' (క్రీడా. 80 ప)

      'కసటువోఁ దెలినీటఁ గడిగి యీటార్చిన' (హర. 7-110)

      'గోధూళి లగ్నంబున నార్యవాటికఁ బ్రవేశించి' (క్రీడా.273వ)

      'గోధూళిలగ్నంబునం బురంబుఁ బ్రవేశింపవలయు' (క్రీడా. 65 వ)

      'శీతకాలంబు గడి మాడసేయఁ గుడుచు
      భాగ్యవంతుఁడు ఱేపాడి పల్లెపట్ల' (క్రీడా. 56 ప)

      'నడినూక లేనియన్నము
      వడఁబోసిన నెయ్యి బుడమవరుగున్ బెరుగున్
      గడి మాడ సేయఁ బెట్టిన
      యడిమాచెలనంబిపడుచునడిగితిననుమీ.' (శ్రీనాథుని చాటుధార)