వేటూరి ప్రభాకరశాస్త్రి
19
ఒకదాని నొకటి రెట్టించుకొనుచుఁ గోకిలములు కొసరి కొసరి కూయుట యిక్కడ వర్ణితము. ఇది శ్రీనాథ సర్వగ్రంథసాధారణము.
'పంజళంబున ధవళ ప్రబంధగీతి
కనుమ యవ్వలికర్ణాటకమలముఖులు' (శివరాత్రి. 2-54)
ఈ 'కనుమయవ్వలికర్ణాటకమలముఖుల' ప్రస్తావన మపూర్వమును ఇతరత్రాదృష్టమును; కనుకనే ముద్రాపకులర్థము తోఁపకేమో వేఱుపాఠమును సంస్కరించి చేర్చి దీని నధోజ్ఞాపికలో నుంచిరి.
గీ॥ వాహకుం డెక్కి విడిచినవారువంపుఁ
గొదమయునుబోలె రతికేళిమదము డిగ్గి
యలసభావంబుతోడఁ గర్ణాటవేశ్య
వచ్చుచున్నది యదె విప్రవర్య ! కంటె! ( క్రీడా. 87 ప)
'చండాలకులవరారోహ వాహకుం డెక్కి విడిచినవారువంబును బోలె
సంభోగమునం దృప్తి చని’ (శివరాత్రి. 3.96)
'కద్రూమహాదేవి గారావు సంతతి
మధుకైటభారాతి మడుఁగుఁబాన్పు' (క్రీడా. 221 ప.)
'ఏ యింతులకుఁ బుట్టినిల్లు దుగ్దాంబోధి
మధుకైటభారాతి మడుఁగుఁబాన్పు.' (కాశీ. 3-199)
ఈ క్రింది శివరాత్రిమాహాత్మ్యపద్యమున నితరకావ్యసాధారణము లగు పదములు గలవు.
చ॥ స్థితి చెడి మాంసభోజనము చేసి జనంగమవంశభామినీ
రతిఁ బరతంత్రుఁడైనపుడుఁ బ్రత్యహమున్ ధరియించు చుండు న
ప్పతితుఁడు గంగమట్టియయుఁబ్రన్ననినున్ననినీరుకావిదో
వతులును.....ములు వంశ్యులయిండ్ల భుజించుకోరికన్. (శివరాత్రి. 3-112)
'అలరుంబోఁడి జనంగమప్రమద' 'గంగమట్టియతోడి సాంగత్య మెడలిన' 'ప్రన్ననిపట్టుతోరము ధరించి' 'గన్నేరుఁబూచాయ కరమొప్ప నీర్కావిమడుఁగుదోవతి' (క్రీడాభిరామము)