Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వేటూరి ప్రభాకరశాస్త్రి

17


     'అదె సంవేద్యము కోటిపల్లి యదె' - ఇత్యాది ( భీమ. 3-54)

     'అదె పట్టిసస్థాన - మిత్యాది ( భీమ-3-55)

     'అదె వియద్వాహిని యదె మణికర్ణిక
               యదె కాశి నిఖిలకళ్యాణరాశి' - ఇత్యాది (కాశీ. 5-117)

     'అదె దారువనభూమి - ఇత్యాది సీస ( 191 ప.) మును దాని తర్వాతిది.

     'తియ్యనివింటిజోదు రతిదేవిచనుంగవ నొత్తిగిల్లి యొ
     య్యొయ్యన వంక చక్కఁబడ నొత్తెడుఁజూచితే పుష్పబాణముల్ (క్రీడా. 192వ)


"ప్రతిభవన భిత్తిభాగంబునం జిత్రించిన చిత్తరువులయందుం గోరకిత నేత్రత్రిభాగుండై కుసుమకంకపత్రంబుల వంకలొత్తుచు రతిదేవివృత్తస్తనంబుల మీఁద నత్తమిల్లిన యున్మత్తచిత్తభవు విక్రమసంపత్తిప్రకారంబును, బట్టపగలు యోజనగంధ యను గంధగజగమనవట్రువచనుంగవ సూచి తొట్రుపడువసిష్ఠ పౌత్రుని దృష్టిప్రియత్వంబును నాచార్యుభార్య యగుతారాదేవిమీఁదఁ దారకారాజు పఱపుచీటంబు వాటంబునేయు లలితకటాక్షవీక్షావిక్షేపమ్ములును, ధృతిమాలి మాలినీసైకతంబున నేకతంబున గురువెందపొదలో వేలుపులంజియ కెంజిగురు చవి సూచిన కుశికనందను రాగావేశంబును గుసుమకోదండ జయడిండిమంబగు విభాండకనుతుని వనితామండలానక్తియు బృందావనంబునందు ముకుందుందొనరించిన నందవ్రజవధూవిహారాడం బరంబును నంబురుహసూతి యాఁడుపట్టిం బట్టికొనిన పట్టునుం బురుహూతుండు గౌతమకళత్రంబుమీఁదఁ గల్పించిన చీకటితప్పును.”

(హర. 5-39)

'అదె దారువనభూమి' ఇత్యాది పద్యమున వర్ణితములయిన కథలే మఱియు 'తియ్యనివింటిజోదు' ఇత్యాది పద్యమునఁగల రతిమన్మథస్థితియే యీ హరవిలాసవచనమునఁ గానవచ్చుచున్నవి. మఱియు నీ క్రీడాభిరామారంభ పద్యమున (2 వ.) 'మాలినీతీరనిర్మల సైకతములలో మేనకాప్సరసతో మేలమాడె' నను విశ్వామిత్ర ప్రశంసాసీస చరణమును పయిహరవిలాసవచనగత విశ్వామిత్ర ప్రశంసయు 'మాలినీతీర సైకత'