Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వేటూరి ప్రభాకరశాస్త్రి

13


'గొజ్జంగిపూనీరు గులికి మేదించిన
          గంగమట్టి లలాటకమునఁ దీర్చి' (క్రీడా. 42ప)

'గొజ్జంగి పూనీరు గులికి మేదించిన
          కమ్మకస్తురి మేనఁ గలయఁ గలదు' (కాశీ. 3-118)

నిద్దంపువెలిపట్టు నెఱిక దూలినయప్డు
          తొడలమించులు వెలిఁ దొంగలింప ' (క్రీడా.137 ప)

'అచ్చవెన్నెలచాయ నవఘళింపఁగఁజాలు
          నిద్దంపు వెలిపట్టు నెఱికఁగట్టి' (నైషధము. 6-22)

'జఱిగొన్న వెలిపట్టు జన్నిదంబులలుంగ
          యంటులు వాయంగ నఱుత వైచి ' (క్రీడా. 42 ప)

'జఱిగొన్న వెలిపట్టు జన్నిదంబులతోడ
          రత్నాలతారహారము ధరించి ' (శివరాత్రి. 2-90)

గంగమట్టియతోడ సాంగత్య మెడలిన' (క్రీడా. 80 ప)

'గంగమట్టి లలాటకమునఁ దీర్చి' (క్రీడా. 42 ప)

'గంగమట్టియమీఁదఁ గస్తూరిరసమున' (శివరాత్రి. 2-90)

'తోకచుక్కలఁ బోలుతోరంపుఁ దెలికన్నులు' (క్రీడా. 137 ప)

'తోకచుక్కలఁ బోలు దృక్తోయజముల' (నైషధము. 8-60)

'అదె ముద్దరా ల్ముసానమ్మనివాసమ్ము' (క్రీడా. 149 ప)

'మోసపోక ముసానమ్మ ముద్దరాలు' (కాశీ. 5-289)

'చరణాంగుళీకుటిలనఖశిఖాకోటికుట్టనమున' (క్రీడా. 235ప)

'కుటిలచంచూపుటకోటికుట్టనముల’ (నైష. 2-5)

'కుటిల పాటలజటాంకురకుట్టనంబున.' (కాశీ. 5-105)