గాంధీ శతకము
(విద్వాన్ బయిరెడ్డి సుబ్రహ్మణ్యంగారి యీ శతకానికి వేటూరి వారు వ్రాసిన ముందుమాట యిది --సం॥)
విద్వజ్జనాభిప్రాయము
'గాంధి శతకము'ను రచయిత వినిపింపఁగా నామూలాగ్రము హాయిగా వింటిని, “రాఘవేశ్వరు చారిత్రము నెందఱెన్నిగతులన్ వర్ణించినన్ గ్రాలదే?” అన్నట్లు “గాంధిదేవ చరిత్రంబును నెంద ఱెన్నిగతులన్ వర్ణించినన్ గ్రాలదే !" ఈ శతకము పద్యములు ధారాళముగా నిర్దుష్టముగా నున్నవి.
గాంధీగారి "ధారాళమయిన నీతులు” కొన్నియును, చరిత్రాంశములు కొన్నియును నిందు సంధానితములైనవి. విద్యార్థులకీ శతకమును సుమతి నీత్యాదులవలె నేర్పవచ్చును.
తిరుపతి,
16-6-48
వే. ప్రభాకరశాస్త్రి.
(శతకము - గాంధీ శతకము
కవి - విద్వాన్ బయిరెడ్డి సుబ్రహ్మణ్యం
ప్రచురణ - 40, భారతీ నికేతనము, తిరుపతి.)
“దీనిని సరిచూచి, సముచిత సలహా లొసంగి, తమ యభిప్రాయము వ్రాసి యిచ్చిన మద్గురువరేణ్యులు శ్రీయుత వేటూరి ప్రభాకరశాస్త్రిగారికి నా హృదయ పూర్వక నమశ్శతములు” అని -
-“తొలిమాట” లో
గ్రంథకర్త.