Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/478

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శిల్పదర్శనము

కొండూరు వీరరాఘవాచార్యులు

అభిజ్ఞుల అభిప్రాయములు

"సంస్కృతమునను ఆంగ్లాది భాషలయందును గల శిల్పశాస్త్ర గ్రంథములను బరిశీలించి, దేశమున గల శిల్ప, తద్రచయితల గణ్యతను గుర్తించి రచియించిన మీ శిల్పదర్శనము నాకు చాల వేడ్క గొల్పినది. ఇట్టి గ్రంథమును ఇంతవఱకెవ్వరును తెల్గున రచించి యుండలేదనుకొందును. మీరు గట్టి ప్రయత్నముతో నిట్టి గ్రంథమును నేడు రచించితిరి. దివ్య శిల్పములు, వాని శిల్పులు సర్వదా పూజార్హులు. మీ గ్రంథము తత్పూజనము కొంత జరిపినది. ప్రాచీన భారత శిల్ప, తద్రచయితల చరిత్ర మింకనెంతో అవ్యక్తముగా నడగియున్నది. (కొంత అణగారి పోయినది కూడ) మీరందు కొంత వఱకైనను తద్రచనము జరిపితిరి. నేను శిల్ప శాస్త్ర రహస్యముల నెఱుగని వాడను. మీ గ్రంథము తద్రహస్యముల నెన్నింటినో నాకెఱింగించినది. మీ వచన రచన చాల హృద్యము. ఇట్టి గ్రంథము లింకను రచింప గలుగునట్లు భగవదనుగ్రహము మీ యెడవరగుగాక !


తిరుపతి,

చిత్తగింపుడు

5-4-1947.

(సం.) వే. ప్రభాకరశాస్త్రి.

గ్రంథం - శిల్పదర్శనము (పరివర్దిత సంస్కరణము)

రచయిత - కొండూరు వీరరాఘవాచార్యులు

ప్రథమముద్రణ - 1946

ద్వితీయ ముద్రణ - 1978 సర్వోదయ ప్రిటర్స్ తెనాలి

ప్రకాశకులు - శ్రీమతి కె. రాజేశ్వరమ్మ గాంధీనగరం తెనాలి. గుంటూరు జిల్లా.)