Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/473

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ధర్మదీక్ష

ముదివర్తి కొండమాచార్యులు

అభిప్రాయము

ఆర్యా! వందనములు

మీ లేఖమును బట్టి మీరు చాలఁ బసిప్రాయపు వారని తెలిసినది. కాని 'ధర్మదీక్ష' యను మీ రచనమును బట్టి చూడఁగాఁ బరిణత ప్రజ్ఞుఁడైన ప్రౌఢ కవికిఁ బై చేయిగా మీరు కానవచ్చుచున్నారు. వస్తువు అద్భుతరసపు సుడిగుండములు గల కరుణరస వాహిని! ఇటువంటి దివ్య కథా వస్తువులను (మత వైముఖ్యముచే) నుజ్జగించి శృంగార ప్రచురములైన పురాణ కథావస్తువులకే మన పూర్వులు ముచ్చట పడిరి గదా !

మీబోటి బుద్దిమంతులు దయాధర్మ ప్రచురములైన కథల నిట్టివానిని గావ్య వస్తువులుగాఁ గొని సరస రచనా సామర్థ్యమును సఫల పఱచు కొందురు గాక !

మీ కవిత మంచి శయ్య, పాకము, భావపరిపాకము కలదై ఆనందము గొల్పుచున్నది. అపూర్వ కావ్య భూషలచే నాంధ్ర సరస్వతి నలంకరించుచు నాయుష్మంతులై కీర్తివంతులై మీరు వెలయుదురు గాక!


తిరుపతి

మకర సంక్రాంతి.

వేటూరి ప్రభాకరశాస్త్రి

( ప్రచురణ - వి.వి. నాయుడు అండ్ సన్స్

ట్రంక్ రోడ్డు, నెల్లూరు

ప్రథమ ముద్రణ - బి ఎన్ కే. ప్రెస్, మద్రాసు

వ్యయ, వసంతము, మే, 1946

అంకితము - శ్రీ వరిగొండ సత్యనారాయణమూర్తిగారికి)