వేటూరి ప్రభాకరశాస్త్రి
431
చరితమున నొక్కపుట కొక్కచరణమునకు
సాటిగావని గొంతెత్తి చాటనేరు! (5 ఆ. 96 ప.)
గీ॥ వీరు లాత్మీయులాప్తులు పృధ్వివరులు
బంధువులు నీగిరీంద్ర గర్భముల నొఱుగ
బిరికి దొంగనుగా నిన్ను దొఱగి జాఱ
వ్రాసె నాతల ధాత! మేవాడమాత! (5 ఆ. 116 ప.)
గీ॥ తలఁదఱుగ నోపుబహు విపద్దశలనైనఁ
గాంతి యించుక చెడని నా కన్నుదోయి
నశ్రుకణములు వొడమె; నీ యడుగుదోయి
నమ్మ ! ముక్తాభిషేకంబు నాచరింతు (5 ఆ. 117 ప.)
సీ॥ హారావళీశైల మనుపమ స్వాతంత్ర్య
వీర దుందుభుల శబ్దించుఁ గాక;
గుట్టలు పుట్టలు గుహలు స్వధర్మత
త్పరుల యశంబు మార్పలుకుఁ గాక ;
మేవాడ రాజ్యలక్ష్మీ పరాక్రమమెల్ల
వేళల భువిఁ దాండవించుఁ గాక ;
త్యాగైక ధనుల సత్యస్వరూపులచే ర
హించి నీ కడుపు ఫలించుఁ గాక ;
గీ॥ భానుకుల గౌరవంబు నిల్వంగ నోడి
త్యాగమునఁ గుంటువడి నీ పదముల గొలుచు
పున్నెములు లేక దూరభూములకు నేగు
మమ్ము మా పేళ్ళు లోకంబు మఱచుఁగాక! (5 ఆ. 119 ప.)
గీ॥ అనుచు భక్తినిఁ జూపి వందనమొనర్చి
మరువఁజాలక చేరెడు మట్టిదీసి
కనులనద్ది రుమాలునఁ గట్టి యూర్చి
యాప్రతాపుఁ "డంకారు” పై నధివసించె. (5ఆ. 120 ప)