430
రాణాప్రతాపసింహ చరిత్ర
సీ။ వేనవేల్ రిపుల నొప్పించు పట్టునఁగర్ణ
పేయమై విందునీ వీరగర్జ
దలద్రుంచు బహుళాపదలుచుట్టినప్పుడు
చెవియొగ్గి హుంకారరవమువిందుఁ
దిండిలేక తపించు దినముల విధిఁజూచి
పెడబొబ్బవెట్టు చప్పుడుల విందు
స్వాతంత్ర్య సమరదీక్షకుఁ బూన్చునీయుప
న్యాసంబులను జెవులారవిందుఁ
గీ॥ గాని కొండంత నొప్పితోఁ గాసిపడుచుఁ
బిడుగుపడినట్లు హృదయముల్ వ్రీలఁజేసి
విన్ననై దీనమగువాక్కు విని యెఱుంగ
ననలమున వ్రేల్చునట్లు నా మనసు పొగిలె. (5 ఆ 94 ప.)
గీ॥ నీ హృదయ పద్మపీఠ నిర్య్వూహమెక్కి
యలరి స్వాతంత్ర్యలక్ష్మి సహస్రభాను
కాంతులను వెల్గెఁ దన్మహాఖండ దీప్తి
కడలుకొని ఢిల్లీ మొగలుల కనులుగుట్టె ( 5 - 95)
సీ॥ పురము రాజ్యము మాని మూఁడేండ్లు శ్రీహరి
శ్చంద్రుండు పడిన కష్టముల నెఱిగి
పదునాలుగబ్దముల్ వనవాసమున రామ
చంద్రుండు పడిన కష్టముల నెఱిగి
పదియు మూడేండ్లుగాఁ బాండవుల్ గహనాంత
రములలోఁ బడిన కష్టముల నెఱిగి
యిరువదిమూడేడు లీవీ వనులఁ గుటుం
బముతోడఁ బడిన కష్టముల నెఱిగి
గీ။ తారతమ్యంబుఁ దూచిన వారియిడుమ
లత్యగాధాపదావర్త మైననీదు