వేటూరి ప్రభాకరశాస్త్రి
425
సేవానందము నిక్కడ నఖండముగాఁ దాండవించినది. నాయకుని సమరోల్లాససందర్భముల నిట్లు రసోదాత్తముగా వర్ణించి, తోడనే ప్రతినాయకుఁడగు నగ్బరు నాస్థానిని, తదీయుల నిర్ణయములను గూడ త్రాసు తూకమున నెడుగుదిగుడుగా నూగులాడించి యక్కడనుండి రాయబారిగా వచ్చిన మానసింహుని, అక్బరు తోడి బాంధవము నెఱపినందుకని యవమానించి పంపుటతో ద్వితీయాశ్వాసమును ముగించినారు. ఇట 281, 282, 283 పద్యములలో మానసింహుడు ప్రతిపాదించిన సంధిషరతుల నభిమానసింహుఁడై ప్రతాపసింహుఁడు ధిక్కరించినాడు. ఉభయ పక్షముల వారి చిత్తవృత్తులకుగూడ నింతటితో నాశ్వాసము ముగిసినది. తృతీయాశ్వాసమెల్ల దారుణయుద్ధము. అందులో నూఱుపద్యముల పట్టునే నే నుద్యోగపర్వరచనా మహత్తుకు మిక్కిలిచేయి యనఁదగినఁ దానిఁ జదివి నీరయినాను. భీమచందు గంభీరోక్తులు, ప్రతాపసింహుని విషాదము చంద్రభట్టారకుని ధర్మోద్బోధము నర్జున విషాదయోగసారాంశములు ! మఱి వీర, కరుణ, శాంత రసముల సుడిగుండములు - అట కవితా ప్రవాహము నంటుకొన్నచోఁ పాఠకుడిందు మునిగిపోవును. వీర భయానక బీభత్స సంక్షోభమయ మయిన పైభాగమును మనసారఁ జదువ నాకు శక్యము కాలేదు. దూరము దూరముగా పయింబయిన చదివితిని. నాకట్టి పట్టులు దుష్పరములు. ఏ వాఙ్మయమునందుఁ గాని, యే సత్యచరిత్రమునందుఁగాని, యిట్టిఘట్టమపురూపమే యనదగినది. ఖండేరాయని వీరనిర్యాణము, సూక్తసింహ ప్రతాపసింహ సౌదర్య సౌహార్దముల పునరనుసంధానము; చైతకాశ్వపు స్వర్గప్రస్థానమునుఁ రాజనీతి రీతిని జూచితిమేని, వీనిలో సూక్త సింహుని ప్రవర్తనము దూషితమనవలెను. అక్బరు సేనలో సేనానియై యుండి యాతని యుప్పుఁదినుచు నాతని పక్షమున యుద్ధము సేయుచు దొంగచాటుగా స్వపక్షీయులను జంపి ప్రతిపక్షమునఁ జేరినాడు. తాను జేరవచ్చుటకు ముందు అక్బరు పక్షమును వీడివచ్చుట యక్కడ వ్యక్తపరుపలేదు. అన్న దగ్గరనుండి మర్నాడు వెడలి అబ్దుల్ రహిమాను ప్రభృతులతోఁ దనమార్పును దెలుపుకొన్నాడు. అప్పుడు అబ్దుల్ రహిమానుడు మానసింహుని మాట వినక సూక్తుని విడిచిపుచ్చుటయు రాజద్రోహమే. రాజనీతిలో - అనఁగా దయాదాక్షిణ్యములు వీడనాడి యుద్దమొనర్చి శత్రువులను జంపుటకే పూనిన