424
రాణాప్రతాపసింహ చరిత్ర
చెందితిని. ఈ పరిణామమును దొలుతనే కవి సూచించినచో నీ యద్భుతరస నిర్వాహము పొసగదుగదా! ప్రతాపుని సత్యదీక్ష తెలియరాదుగదా! ఇట్లు నాటకము నందుఁ బోలె నద్భుత రసనిర్వాహ మీ గ్రంథమునఁ బెక్కు పట్టులఁ గలదు. ఇట్టిపట్టుల సమకూర్చుటలోఁ గవికల్పనా కౌశలము చాలఁగా పనిగొని యుండవచ్చును. ప్రతాపసింహుడు దౌర్భాగ్యమయుఁడై విజయాశ వీడి, యనుచరులతోఁ గూడి, పిడికెడు మాతృదేశపు మృత్తికను దలమీద ధరించి దేశాంతరములకుఁ బయనము సాగింపఁబూనినప్పుడు పర్షియానుండి భామాసాహియను ప్రాచీన మంత్రి వచ్చి పర్యాప్తమైన ధనమొసఁగి, యుద్ధమునకు మరల నుపక్రమింపఁ జేయుటయుఁ దదాదిగా సర్వము జయమే యగుటయుఁ దటస్థించినది. ఇట భామాసాహి సంఘటన సన్నివేశ మద్భుతరసావహము. మహాభారతమును మించి యే గ్రంథమున నలౌకిక మాహాత్మ్య సందర్భములు లేకయే యద్భుత కథార్థములిట్టివి మఱియెన్నో గలవు. భామాసాహియే కథానాయకుని యశశ్శరీరమునకుఁ బ్రాణము వోసిన మహాత్యాగి. ఈ క్రింది కథాఘట్టములీ గ్రంథమునఁ గండపట్టు లనఁ దగినవి.
రాజపుత్ర స్థానపు క్షత్రియులకు మేవాడ క్షత్రియాన్వయము వారు రాజాధిరాజులును, గురురాజ పట్టభద్రులు నట! అట్టి వంగడపు టేలిక యగు ప్రతాపసింహుని తలపై రాజపుత్రస్థాన క్షత్రియ సంప్రదాయ సంరక్షణభారము, కిరీటముతోఁబాటు నెలకొన్నది. అందు కర్హుఁడనియే సలుంబాకృష్ణుఁడు తాను మాట దప్పిన వాఁడన్న సడికిఁ బాల్పడి యాతనిఁ బట్టాభిషిక్తునిఁ జేసినాఁడు. ఇక్కడ కుటుంబ కలహములు రేగినవి. సోదరులే శత్రువగు నగ్బరు పక్ష మాశ్రయించిరి. రాజ్యారంభముననే యంతఃకలవరము - అయినను రాజపుత్ర స్థాన సామంత మండలమెల్ల, నిర్వికల్ప నిశ్చయముతోఁ ప్రతాపసింహు ననువర్తించుట, వారికి ధైర్యోత్సాహ దీప్తి నాతఁడు కలిగించుట అబ్బురము గొల్పును. ప్రతాపసింహుఁ డనుచరులతోఁ గర్తవ్యము నాలోచించుట మొదలుగా మేవాడపాడు పఱచుదాఁక గల నూఱుపద్యముల గ్రంథభాగమున, పలువురొక ధర్మనిర్ణయమునే పలు దెఱఁగుల నుల్లేఖించుటను, గర్తవ్యమునకు దూఁకుటను, నేర్పుతో గంభీర నిర్భరముగాఁ గవిగారు నిర్వహించినారు. స్వామిభక్తి, దేశభక్తి, రాజగురురాయని