Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/451

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ టేకుమళ్ళ కామేశ్వరరావు గారికి

వేటూరి వారి లేఖ

"నా వాఙ్మయ మిత్రులు" అనే గ్రంథంలో శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారిని గురించి వ్రాస్తూ శ్రీ టేకుమళ్ళ కామేశ్వరరావుగారు శాస్త్రిగారి ఒక లేఖను ఉటంకించారు. అది ఈ క్రింది విధంగా వుంది.

"శాస్త్రిగారు భాండాగారోద్యోగం నుండి 1940 లో పింఛినీ పుచ్చుకొన్నారు. నేను 1941లో ఏలూరులో ఉంటూన్నప్పుడు నా పుస్తకమొకదానికి, వారిని పీఠికను వ్రాయమని కోరుతూ లేఖలను వ్రాసేను. దానికి ఇట్లు జవాబును ఇచ్చేరు.

తిరుపతి

24-4-41

అయ్యా !

మీ కార్డులు చేరినవి. నేను గ్రామైక రాత్రముగా సంచారమున ఉన్నాను. వారం రోజులలో ఏలూరు రాగలను. ఈ లోగా మీరు ముద్రిత గ్రంథ భాగము పంపుట, అది నాకు అందుట, అసంభవము. నేను ఏలూరు వచ్చుట చి॥ శేషాచార్లుగారు యమ్‌బిబియస్. అనువారికి, దామరాజు వెంకట్రావు అనువారికి తెలియ గలదు. మార్చి (?) 4,5 తేదీలలో రాగలను అంతదాక మీరాగ గలిగితే, నే నక్కడికి వచ్చినపుడు మీరు మీ గ్రంథము నిచ్చినపుడు, మీరు కోరిన తీరున యగును.

వే. ప్రభాకరశాస్త్రి

"కాని వారు ఏలూరు రాకపోవడం చేత, విధిలేక ఆ పనిని మరొకరి చేత చేయించవలసి వచ్చిందని చెప్పడానికి విచారిస్తున్నాను.”

(పుట. - 242)

చిత్తూరు, 1966