10
క్రీడాభిరామము
శా॥ సారాచారమునన్ వివేకసరణిన్ సౌభాగ్య భాగ్యంబులన్
ధౌరంధర్యమునన్ బ్రతాపగరిమన్ దానంబునన్ సజ్జనా
ధారుం దిప్పనమంత్రివల్లభు నమాత్యగ్రామణిం బోల్పఁగా
వేరీ మంత్రులు సింధువేష్టితమహోర్వీ చక్రవాళంబునన్.
(క్రీడా.31 ప.)
శా॥ వేరీ నిన్నెదిరింపఁగా జగమునన్ వీరుల్ ప్రతాపోద్దతిన్
ధౌరంధర్యమునన్ బ్రభావమహిమన్ ధైర్యంబునన్ జాపలీ
లారంభంబున సాహసిక్యమున బాహాశక్తి దివ్యాయుధో
దారప్రౌఢిమ దేవదైత్యనరగంధర్వాది సంఘంబునన్
(హర. 7-144)
గీ॥ గార్గ్యసిద్ధాంతమత ముషఃకాలకలన
శకున మూనుట యది బృహస్పతిమతంబు
వ్యాసమతము మనఃప్రసాదాతిశయము
విప్రజనవాక్య మరయంగ విష్ణుమతము. (క్రీడా. 66వ)
గీ॥ గార్గ్యసిద్ధాంతమత ముషఃకాలకలన
శకున మూనుట యది బృహస్పతిమతంబు
విప్రజనవాక్య మరయంగ విష్ణుమతము
సర్వసిద్ధాంత మభిజిత్తు సమ్మత మగు. (భీమ. 3-41)
శా॥ వ్రాలెన్ దిక్కుల భానుభావ్యతికర ప్రక్రీడదర్కోపల
జ్వాలాజాల జటాల జాంగలతటీ వాచాలకో యష్టులై
రోలంబంబులు మూతి ముట్ట వెఱచెన్ గ్రొవ్వేఁడిబీరెండలన్
జాలంగ్రాఁగి కరంబు వేఁడియగు కాసారాబ్జమైరేయముల్
(క్రీడా. 153ప)
శా॥ మౌళిం గోహళి సంఘటించినక్రియన్ మధ్యాహ్నవేళన్ మహా
కాళంబైన నభోవిభాగమున వీఁకం గాసె బీరెండ యా
ప్రాలేయాహిత సంప్రదీప్త కిరణప్రక్రీడదర్కోపల
జ్వాలాజాలజటాల జాంగలతటీవాచాలకోయష్టియై.
(హర. 7-108)