Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/438

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వేటూరి ప్రభాకరశాస్త్రి

403

స్వస్తిశ్రీ జయాభ్యుదయశాలివాహనశకవర్షంబులు 1506 అగు నేటితారణ సం॥ వైశాఖశుద్ధ 14 శ్రీమద్రాజాధిరాజ రాజ పరమేశ్వర శ్రీవీర ప్రతాప శ్రీవీర శ్రీరంగరాయదేవమహారాయలు గారు పెనుగొండనగరమందు వజ్రసింహాసనారూఢులై పృథ్వీ సామ్రాజ్యము చేయుచుండఁగాను శ్రీమద్వేదమార్గ ప్రతిష్ఠాపనాచార్య సర్వతంత్రోభయ వేదాంతాచార్యులయిన శ్రీ శఠగోపజియ్యంగారి కార్యకర్తలయిన రాచప్పగారున్ను శ్రీ అహోబలస్థానం వారున్ను కాశ్యపగోత్ర ఆపస్తంబసూత్ర యజు శ్శాఖాధ్యాయులయిన సూర్యవంశోద్భవులయిన మూరురాయర బసవశంకర గుత్తిహన్నిబ్బరగండ యెరయూరి పురవరాధీశ్వరులయిన శ్రీ మన్మహామండలేశ్వర కొండ్రాజుతిమ్మరాజుగారి పౌత్రులయిన తిమ్మరాజు గారికి పుత్రులయిన వేంకటరాజు దేవమహారాజులుంగారికి యిచ్చిన శిలాశాసన క్రమ మెట్లన్నను, ప్రాక్‌బహుధాన్యనామ సంవత్సరాన నిభరామ వారు హండేవారిని కూడుకొని సీమ యంతా రాచూరా పట్టి అహోబలస్థలానకు వచ్చి అహోబలం అంతా పాడుచేసి అహోబలస్థలం అయిదుఆరుఏండ్లు తమ వశంచేసుక ఆక్రమించి నడుస్తూవున్న నిమిత్తం శ్రీ అహోబలేశ్వరులు సన్యాసం ప్రసాదించిన ఆదిమమైన శఠగోప జియ్యంగారికి ఏడోతరమై శ్రీ పురుషోత్తమ ఆళ్వారుల ప్రతిష్ఠసేసి ముకుందదేవునిచేత పూజగొని రామానుజ దర్శనోద్ధారకులైన శ్రీ పరాంకుశ మహాముని శిష్యులయినటువంటి శ్రీ మచ్చఠకోపస్వామివారి స్థలం యీ తీరున అయిన నిమిత్తం శ్రీరంగరాయ దేవమహారాయులు సముఖాన తాము మనవిచేసి మీరు యీ తీరున రత్నసింహాసనారూఢులై వుండిన్ని మీకులస్వామియైన అహోబలేశ్వరుని స్థలం తురకలు....”

ఈ శాసనములోని వేంకటరాజు దేవమహారాజులుంగారు మన కామందక కృతిపతి యగు వేంకటరాజే !

ముద్రణము

తంజావూరు సరస్వతీ మహలులోఁ దప్పులమయముగాఁ దాటాకుప్రతి యొకటియే కలదు. దానికి ప్రతివ్రాయించి తత్పుస్తక శాలాధికారులు మాకుఁ బంపిరి. మక్కికి మక్కిగా వ్రాసిన వ్రాత యగుటచే దాని దిద్ది ముద్రణమున కిచ్చుటకు సాధ్యము కాదయ్యెను. అందుకై ముద్రణార్హముగా అధిక