Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/437

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

402

ఆంధ్రకామందకము

ఈ వెంకటాద్రి నరేంద్రుఁడు కామందక సప్తమాశ్వాసారంభమున నిట్లు సంబోధింతుఁడయ్యెను.


కం. శ్రీ మదహోబల నృహరి
     స్వామి పునస్థ్సాపన ప్రశస్త జయాంకా
     రామపద భక్తివర వి
     ద్యామహ కొండ్రాజు వెంకటాద్రి నరేంద్రా ॥
                                                  ఆం. కా. 7 ఆ. ప. 1.


అని యుండుటచే నీ వెంకట్రాజు అహోబలస్వామి భక్తుఁడై యానృసింహ దేవాలయము నుద్ధరింపఁబ్రయత్నించి నట్లు తెలియ వచ్చుచున్నది. ఈ విషయమే రెట్టమతగ్రంథమునందును.


సీ။ శ్రీమదహోబలస్వామిమహారాజ్య
               రక్షకుం డగుచు నే రాజు వెలయు
     నభిరామకామందకాఖ్య సత్కావ్యర
               త్నమునకు నేరాజు నాథుఁడయ్యె
     నెరయూరి పురవరాధీశాది బహుబిరు
               దాంకుఁడై యేరాజు యశముగాంచె
     జానకీ నాయక చరణ సంసేవన
               ప్రౌఢిచే నేరాజు ప్రబలు సిరుల

గీ॥ నతఁడు కొండ్రాజుతిమ్మభూపతివరేణ్య
     తనయ పెదతిమ్మరాజవతంస గర్భ
     వార్ధిచంద్రుండు సత్కులవర్ధనుండు
     సతతవిభవుండు వెంకటక్ష్మావిభుండు ॥

     అని కలదు.


ఈ వెంకట్రాజు అహోబలము నుద్దరించె ననుటకు అహోబల మహాద్వారమున శాసనప్రమాణమున్నది.

“శుభమస్తు. శ్లో. దేవశ్రేణీశిరోరత్నం దైత్యద్విపఘటాంకుశమ్ !

జయతు శ్రీ నృసింహస్య దేవదేవస్య శాసనమ్ ॥