వేటూరి ప్రభాకరశాస్త్రి
401
మ॥ కపటారాతి విభంజనోద్ధతమతీ ! కర్ణాట సింహాసనా
ధిపతి ప్రాప్తరమాధురీణ : కరుణాబ్ధి! కంతుసౌందర్య ! కా
శ్యప సద్గోత్ర పవిత్ర ! నమ్రతరవాచానైపుణీ నిర్జితా
హిప ! కామందకకావ్యనాయక ! కవీంద్రేష్టార్థ సంధాయకా !॥
రెట్టమతము.
ఆంధ్రకామందకగ్రంథమునఁ బ్రథమాశ్వాసాంతమున
కం॥ శ్రీ చంచద్భట్టరు చి
క్కాచార్య వరార్య శిష్య యతులిత శౌర్య
ప్రాచుర్యధుర్య గుణర
త్నాచల జయలలిత ధైర్య నయవినయనిధీ ॥
ఆం. కామందకము ఆ 1. ప. 65
అని వెంకటాద్రి సంబోధింపఁ బడియున్నాఁడు. ఈతఁడు భట్టరు చిక్కాచార్యులకు శిష్యుఁడు. ఈ భట్టరుచిక్కాచార్యులకుఁ బలువు రాంధ్రకవులు శిష్యులుగా నుండిరి. చాతుర్వాటికా మాహాత్మ్యము. ఆనందకాననమాహాత్మ్యము మొదలగు ప్రబంధములను రచించిన లింగమకుంటతిమ్మకవియు, తెనాలి
రామకృష్ణకవియు నీతని శిష్యులే. ఈ విషయమును వారికృతులందలి పద్యములు తెల్పుచున్నవి.
కం॥ గురురాయపట్టభద్రుని
నరిహరు శ్రీరంగనాయకాంశభవున్ భ
ట్టరు చిక్కాచార్యుల మ
ద్గురులఁ దలఁచి యడుగులకు నతుల్ గావింతున్ ॥
లింగమకుంట రామకవి
సీ॥ శ్రీ వైష్ణవ హితుండఁ జిక్కయ భట్టరు శిష్యుఁడ.
లింగమకుంట తిమ్మకవి.
కం॥ వాక్కాంతాశ్రయభట్టరు
చిక్కాచార్యుల మహాత్ము శ్రీ గురుమూర్తిన్
నిక్కపు భక్తి భజించెద
నిక్కావ్యకళాకలాప మీడేరుటకున్ ॥
పాండురంగ మాహాత్మ్యము.