Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/434

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వేటూరి ప్రభాకరశాస్త్రి

399


గీ॥ దైవహతకుండు దైవ చింతన పరుండు
     వ్యసన దుర్భిక్షకుఁడు బలవ్యసనపరుఁడు
     లలినదేశస్థ బహుశాత్రవుఁడును గాల
     యుక్తుఁడును సత్యధర్మ వియుక్తమతియు.
                                   (స. స. ప. 526)

కం॥ ఈ యిరుపదవురు తోడన్
       బాయక విగ్రహము సేసి పైకొనుటయు వా
       రేయెడ మార్కొనక బల
       శ్రీ యఱి వశవర్తులగుచు సిరి యిత్తు రిలన్.
                             (స.స.ప. 527: ఆం. కా. ఆ, 4. ప. 70)

సీ॥ దక్షిణానిలముఁ బ్రదక్షిణాగ్నియు నధ్వ
               సంతతోత్సాహంబు సాధువాద
      చారుమంగళపాఠకారవంబు సుహృష్ట
               పుష్టజనంబును బొలుపు మిగుల
      నతిమనోహరముగా నరసి చెప్పిన శుభ
               కలిత లక్షణములు గలిగియున్న
      యట్టి వేలంబు, ప్రఖ్యాతమై పొలుపొందు
               నతిశుభమై యుండు నధికశత్రు

ఆ॥వె॥ జయము గలుగునట్టి చందంబు...
           నందగ విపరీత మయ్యెనేని
           యపజయంబు నొందునట్టి చందములెల్ల
           నెఱిఁగి నృపతి నిశ్చయింపవలయు ॥
                                    (స.స.ప. 810. ఆం.కా. ఆ. 7. ప. 99)

ఉ॥ ఒక్కటఁ గూటయుద్ధమున నుక్కఱ శత్రు వధించినన్ జయం
      బెక్కుడు గల్గి పాప మొకయించుక పొందదు నిశ్చయంబు పే
      రుక్కున ద్రోణసూనుఁడుఱ కొక్కయెడ న్నడురేయి నిద్రమైఁ
      జొక్కిన పాండునందనులఁ జూచి వధింపడె సౌప్తికక్రియన్॥
                                         ( స.స.ప. 954: ఆం.కా. ఆ. 8ప. 50)