Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/433

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

398

ఆంధ్రకామందకము


సీ॥ భద్రసేనుఁడు నిజపత్నియింటికిఁ జన
               నతనితోఁబుట్టువ యతనిఁ దునిమె
      దల్లి మంచముక్రింద నల్లన యడఁగి తాఁ
               బుత్రుండ కారూషుఁ బొడవడంచె
      లాజలు విషమున నోజించి తేనియ
               యని కాశిరాజుఁ దద్వినిత యడఁచె
      గరళాక్త మేఖలాఘనమణి సౌవీర
               భూపు వైరంత్యు నూపురముచేత

గీ॥ జాతుషంబగు శస్త్రంబు జడ నిడికొని
     రమణి తా నొక్కరిత విదూరథుని జంపు
     టెఱిఁగి నమ్మక సతియింటి కేఁగఁ జనదు
     కెరలి శత్రులపయిఁ బ్రయోగింపవలయు.
                 (స. స.ప, 287: ఆం.కా. ఆ. 3ప. 140 )

చం॥ అరివరు శత్రుదుర్గమును నాతనిబంధుసుహృద్విభేదమున్
        బురధనసైన్యసంపదలపోఁడి మెఱుంగుట కృత్యపక్ష వి
        స్తరపరిసంగ్రహం బతనిజానపదాటవికంబు సాధ్యముల్
        దిరమిడి యుద్దసారము విధిజ్ఞత యన్నివి దూతకర్మముల్
                                   ( స.స.ప. 362. ఆం. కా. ఆ. 5ప 77)

సీ॥ బాలుండు వృద్ధుండు పటుదీర్ఘరోగియు
               నిల నిజజ్ఞాతిబహిష్కృతుండు
      భీరుకుండును గడు భీరజనుండును
               లుబ్ధుండు మఱియును లుబ్ధజనుఁడు
      సతతవిరక్త ప్రకృతియైన నృపతియు
               విషయరసాసక్త విరళమతియు
      మఱియును బహుచిత్తమంత్రుండు దేవతా
               బ్రాహ్మణ నిందా పరాయణుండు