వేటూరి ప్రభాకరశాస్త్రి
381
వ్యవహారములుగూడ ఇక్కడ జరుగునట్లు యేర్పాటు చేసి దీనికి ముర్తుజానగరు సర్కారని పేరిడి కొండవీటి సీమనంతయు 14 సమతులు చేసినారు. పాలడ్లు, పులివఱ్ఱు, ప్రతిపాడు, సంతరావూరు, నూతక్కి, చీరాల, పాణం, మంగళగిరి, మునిగోరు, నాదెళ్ళ, రావిపూడి కూచిపూడి, గుంటూరు, తాడికొండ ఈ విధముగ 14 గ్రామాదులను 14 సమతులు చేసిరి.
కొండవీటి జిల్లాలో హుజూరునాయకుడు ఖిల్లాదారు హోదాలో యున్న మాణిక్యరావు స్వదేశిముఖి అవిన్నీ, మాసూరువారికి మజుందారనిన్నీ, పాత్రునివారికి దేశపాండ్యగిరిన్నీ సదరు సమతులను స్వాధీనపరచి నాదెళ్ళ సమతుకు కమ్మవారిని నియమించి వారి పరంగా మామ్లియతు జరిగేటట్లుగా నిర్ణయించినారు. తరువాత మహమదుపాదుషాహి రాయలంగారు గోల్కొండను రాజ్యంచేయుచు బందిపోట్లను అణచుటకై అమీనుముల్కును కొండవీటికి బంపగా అతను బందిపోట్లను అణచి 1514లో ముల్లగూరి అగ్రహారమును పాడుచేసి తన పేర మల్కాచెర్వు, మల్కామహాలు, మల్కాబావి కట్టించి ముల్లగూరిని యాబలూరి గ్రామంలో కల్పి అమీనుబాదా అను పేరుపెట్టి దుర్గం కట్టించిరి. ఒక బురుజు పేరు మల్కాబురుజని పేరుపెట్టి హిందువుల కట్టడముల పాడొనరించి 1512 నుండి 1520 వరకు 7 సం॥ పరిపాలించెను. ఆ కాలమందు సిగిలిన్‌ఖాను ఈ పురమువచ్చి మహమ్మదు కుదుబ్‌షావారి ఈ పురమునకు దక్షిణమున పేట, పురము కట్టించెను. తరువాత అబ్దుల్లా సుల్తాను, అబ్దుల్లాహుస్సేను, తానీషా అలంగీరు, పాదుషాలు రాజ్యము చేసిరి. వారి దినములలో అధికారము చేసిన హమీళ్ళుచితాపఖానుడు 1521 నుండి 1524 వరకు, 1524 నుంచి ఒక సం॥ అభినిసిద్ది చివులు ఖానుడు 1524 నుండి 1527 వరకు అప్సరస ఖానుడు ప్రభుత్వం చేసిరి. వీరి తర్వాత యఖ్లాస్ఖానుడు గుంటుపల్లి ముత్తురాజయ్యలు పరిపాలించిరి. తరువాత 1574లో యఖ్లాస్‌ఖానుడు అమీలు అయి పూర్వము రెడ్లరాజులు చిన్నకొండమీద కట్టించిన విఘ్నేశ్వరాలయమును పడగొట్టించి ఈ దేవాలయానికి దక్షిణంగా కొంచెం నైరుతి మూలగా యఖ్లాస్‌ఖాను పేట కట్టించి, ఆవూరు గణేశపేట అనికూడ పిలుస్తూ వచ్చిరి. పిమ్మట కుటిఖానుడు అమీను పదవికి వచ్చి 1574 నుండి 1577 వరకు మూడు సం॥ పరిపాలించెను. తరువాత జూపల్లె