Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/415

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

380

ధనుర్విద్యావిలాసము

దూరాన రామచంద్రపురమనే అగ్రహారము కట్టించి పర్వతేశ్వరుడను ప్రతిష్టించి, గోపీనాధ అనే చెరువు త్రవ్వించి సాంతలూరు అనే అగ్రహారమును ధారాగ్రహీతము చేసెను. ఇతను మొగలాయి పౌజును జయించి రాజ్యము నిర్వక్రముగా పరిపాలించెను. విజయ నగరమందు సదాశివదేవమహారాయలు పరిపాలనము చేయుచుండి అత్రేయగోత్రులై విఠలయ్య దేవమహారాజుగారిని ఈ దేశానికి పట్టం కట్టిరి. ఇతను కొండసింగయ్య అను దేవాలయమును ఈ దేవాలయమునకు ఉత్తరాన కొండపల్లి చెరువు పడమర వక తోట నిర్మించెను. ఇతను 1443 మొదలు 1470 వరకు 27సం॥లు పాలించెను. విజయనగరంలో అప్పుడు పరిపాలించుచున్న రామరాజయ్య దేవమహారాయలను 1487 లో తురకలు చంపి రాజ్యము స్వాధీనము చేసుకొని మల్కిరాయపాదుషావారు పరిపాలించుచు ముర్త్యుజ అనే తురకను ఈ దేశానికి పరిపాలనకు పంపిరి. అతను దేవాలయములు పడగొట్టి గోపీనాధ పురమునకు ముర్తుజానగరమని పేరిడి రాజ్యము చేయుచుండగా శ్రీ వీరప్రతాపతిరుమల దేవరాయలు కృష్ణయావలనున్న మొగలులను జయించి సామ్రాజ్యానికి వచ్చి ఆనెగొంది తిరుమల దేవరాయల పుత్రులయిన శ్రీరంగరాజయ్యకు ఈ దేశానికి ప్రభుత్వం కట్టిరి. ఆయనే కృష్ణాతీరమందున్న మూరంపూడి అనే గ్రామమును గంగాధర రామేశ్వర స్వామివారికి దానంచేసిరి. ఇది 1474లో జరిగెను. అజరత్ విభురాపాదుషాహావారు కృష్ణా ఆవలిభాగం ప్రభుత్వం చేస్తూయుండిరి. కర్ణాటకపాదుషాహా శ్రీరంగరాయలను జయించి కృష్ణ దక్షిణదేశమందున్న వినుకొండ మొదలైనవి సాధించవలెనని రాయరావు అనే బ్రాహ్మడికి సేన ఇచ్చి పంపగా ఆయన వినుకొండ, బెల్లంకొండ, నాగార్జునకొండ, మాచెర్లసీమ జయించి వెలమవారు పరిపాలించుచున్న నేలకోట కొబ్బెర్లతోట జయించి అద్దంకి, అమ్మనబ్రోలు, కందుకూరు, పొదిల, దరశి, కంభం, కాకర్ల, తూపాడు, తంగేడు, గురజాల, కేతవరం, కోడెపూడి మొదలైన నేలకోటలను జయించి కొండవీటిని ముట్టడించగా రాయలవారి ముతాలీమతులై ? ముఠాధిపతులైన? వెలుగోటి తిమ్మన్న లోబడి రాయరావుకి ఆధీనుడైనాడు. 1502లో స్వాధీనపరచుకొని 1504 వరకు పరిపాలింపగోల్కొండకు వెళ్ళెను. గోల్కొండలో ఉన్న అజరత్‌గారు ఇక్కడ మన పూర్వీకుడు ముర్త్యుజాచే గట్టపడిన పట్టణము బాగుగా కట్టించెను. వినుకొండ, బెల్లంకొండ మొదలయిన దుర్గముల