వేటూరి ప్రభాకరశాస్త్రి
373
సీ. దురములోఁ గదిసినదొరలశిరంబులు
భేదింప బలుదిట్ట నీదుపట్ట
కదనరంగమునందుఁ గదసినపరరాజ
నిచయంబులను దాఁకు నీదుబాకు
జన్యసంతోషులై చనుదెంచువైరుల
నిముసంబులో మ్రింగు నీదు బాంగు
.....................................................
.......................................................
గీ. సొరిది నీడాలు వైరులచుక్క వ్రాలు
బళిర నీపౌరుషం బెన్నఁ దరముగాదు
అవనిమాణిక్య రాజవంశాబ్దిచంద్ర
రాజవేంకటగోపాలరాయభూప.
సీ. శ్రీకరవిజయలక్ష్మీ విరాజితవైభ
వేంద్రుండు సద్గుణసాంద్రమూర్తి
మాణిక్య రాడ్వంశ మందార భూజంబు
పద్మనాయక మనఃపద్మహేళి
మన్నెకులోద్యాన మధుమాసపైకంబు
కామినీమన్మధాకరవేషు
సతిపుణ్యపంగోత్ర వితతాబ్దిచంద్రము
డర్థిచాతక వార్షుకాంబుదంబు
గీ. అని జనుల్ మెచ్చఁ గీర్తిచే నలరి తహహ
చరితదేశాంత సత్కవీశ్వరనితాంత
వర్ణితస్వాంత రేపల్లెపూర్నిశాంత
దీపితాటోప! వేంకటగోపభూప.
వీరనేక దేవాలయములకు భూముల నిచ్చిరి. బ్రాహ్మణుల కనేకులకు వసతులు గల్పించిరి.
మాణిక్యారావువారు కల్పించిన దేవబ్రాహ్మణవృత్తులు.