Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/407

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

372

ధనుర్విద్యావిలాసము

వానిని నేను చాటుపద్యమణిమంజరిలోఁ బ్రకటించితిని.


సీ॥ సుమమౌక్తికా నల్పసుప్రతీకంబుతోఁ
               గంబుతోఁ బుండరీకంబుతోడఁ
      బల్లవకుసుమ సంపాదనై కాంతుతోఁ
               గంతుతో రోహిణీకాంతుతోడ
      నధిగతపరమోగ్రుఁ డైన స్వర్భానుతో
               భానుతో నలచిత్రభానుతోడ
      దండిగాండీవకోదండాభిరాముతో
               రాముతో నందనారాముతోడ

గీ॥ నీదు సత్కీర్తి నీ మూర్తి నీ ప్రతాప
     దీప్తి నీ దోర్బలస్ఫూర్తి దీటు మిగిలి
     యలరె మాణిక్యరాయవంశాబ్దిసోమ
     భాసురగుణాళి భావభూపాలమౌళి

సీ॥ ఒక తాత కుతుబుశా ప్రకటదక్షిణభుజా
               దండుఁడై కోవెలకొండ యేలె
      నెలమి రెండవతాత యిభరాముపాదుశా
               పంపునఁ బెదకొండపల్లె యేలె
      మహి మించు ముమ్మడి మాణిక్య రాయఁడు
               వినుతి కెక్కినకొండవీటి నేలె
      రాణించు రఘుపతి మాణిక్యరాయండు
               పరభయంకరవృత్తిఁ బరిఢవిల్లెఁ

గీ॥ దండ్రికంటెను బెదతండ్రి తండ్రికంటె
     తాతముత్తాతలకు నెల్ల ఖ్యాతి దనర
     వన్నెగంటి కృష్ణానేని వంశమునను
     నిర్మలోపాయ బళిర మాణిక్యరాయ.