368
ధనుర్విద్యావిలాసము
పాటలు నేర్చిన వారిని రక్షించేవాఁడు, ప్రేమగలవాఁడు, వదులు కంకణాలు గలవాఁడు, పానీయశాలలుగలవాఁడు, నన్నన్ అని పేరుగల వాఁడుగను, వెణ్మని (వెల్మని) బచ్చలి తీగలవ్నతి ( చెంచ) గల వియలూరు అను గ్రామము అని పై నేదోయున్నది. వెణ్మాన్, వెల్మన్, వేళాలన్, వెల్లాళన్ అన్నీ ద్రవిడమునఁ బర్యాయపదములట. [1]
ఐక్ష్వాకులు మొదలగు క్షత్రియు లంధ్రదేశమునకు వచ్చి రాచఱికము నెఱపి, ద్రవిడ దేశమునకును వ్యాపించి (శ్రీరంగనాథస్వామి యిక్ష్వాకుల నాఁటి కథలు ) యుండవచ్చును. తెలుఁగు దేశమున క్షత్రియులు అట్లే వెలుమవారును క్షత్రధర్మముతో తెలుఁగు దేశమున వర్ధిల్లి ద్రవిడదేశమునకును జేరియుండవచ్చును. బసవపురాణమున వెల్మనికథ యొకటి హృద్యమైనది కలదు. అది ద్రవిడదేశపు శివకవియగు సుందరమూర్తినాయనారు నాఁటి కథ, అది తెలుఁగున నున్నట్లు గాక ద్రవిడమున పెరియపురాణమునఁ గొంత భేదముతో నున్నది. వెల్మలను గూర్చి చాటువు.
ఉ. పైకొనువారితో నొరఁగిపాఱరు, నేరరు భంగసంగతుల్
చేకొనఁబూనికాని దొరఁజేరరు కోరరు దుష్టజంతుర
క్షాకరణంబు నొడ్లకపకారులుగా రెపు డప్పుగోరు మం
దాకినితోడబుట్టియు గుణప్రతిభన్ వెలుమల్ పురంబునన్.
- ↑ తిరుపతి శ్రీవెంకటేశ్వర రీసర్చి ఇన్‌స్టిట్యూట్‌లో అరవరీడరుగానున్న శ్రీపళనియప్పపిళ్ళగారీ విషయము తెల్పిరి.