వేటూరి ప్రభాకరశాస్త్రి
367
హెచ్చు విషయములు గుర్తింపఁగాలేదు. ఆతనిగద్య మిట్టిది. “ఇది శ్రీవిమల చిత్తముని చరణసేవాధురీణ, రాఘవపాండవీయాది బహుప్రబంధనిబంధన ప్రవీణ ఆపస్తంబ సూత్రహరితసగోత్ర ఉరుటూరి ..... ంకశ్లేష కవితాపితా మహోంక సంస్కృతాంధ్ర భాషా చతుర్విధ వివిధ కవితా నిలయ వెంగన మంత్రి తనయ వినయవిశంకట వెంకటకృష్ణకవి ప్రణీతంబైన యాకాశరావణ సంహారంబునందు తృతీయాశ్వాసము.”
కృతిప్రేరకులు - వెలమవారు
'వెలమ' యని నేటివ్యవహారమైనను వెలుమ 'వెల్మ' పదములే ప్రాచీన వ్యవహార రూఢములు. రెడ్డి, కమ్మ, వెలమ, బలిజ జాతులవారు బహు ప్రాచీనకాలమున నుండియు నంధ్రదేశమున మహాప్రాభవము ననుభవించినవారు. ఇప్పుడు ప్రసక్తులగు వెలుమవారిలో పద్మనాయకులను వారు (వారికే పద్మ వెలుమ లనివ్యవహారము ) చాల సుందరాకారులు, రాచఠీవిగలవారు, ఏల్బడులు నెఱపుచు, వీరాధివీరులయి చాల విఖ్యాతిగన్నవారు. వారి యాచార వ్యవహారములు రాచవారి తీరు లవి. కాకతీయులనాఁట నుండి నేఁటిదాఁక నవిచ్ఛిన్నమయినరాజ్య వైభవము ననుభవించుచు వర్ధిల్లినవారు. వెలుమవారిలో రావువంశ్యులగు వెలుగోటి ప్రభువులు. 'వెలుమ' పదము 'వర్మ' పదవికృతి కావచ్చును. 'వర్మ' పదము వరుమ, వలుమ వెలుమ పదములుగాఁ గ్రమపరిణామము చెందియుండవచ్చును. 'నందాంతం క్షత్రియకులమ్' అన్న ప్రవాదముచొప్పున నెన్నఁడో క్షత్రియులు పలువురు చతుర్థ వర్ణమువారుగా మాఱియుండవచ్చును. అయినను వారు క్షాత్రధర్మమును వీడనాడక వెలయుచునే యున్నారు. తెలుఁగున వెలుమలే ద్రవిడ దేశమున 'వెళ్మాన్' అనఁబడు వెళ్ళాలవారు నయిరి. అహనానూఱు అను నతి ప్రాచీన ద్రావిడ గ్రంథమున 'వెణ్మాన్ - వెల్మాన్' వెల్మనుగూర్చి పద్యమొకటి కలదు.
“అహ వునర్ పురన్ద అన్బిన్ కడల్ తొడి నఱవు.
మహిళ్ ఐరుక్కై నన్నన్ వేళ్మాన్ "
వయలై వేలివియలూర్ - 97 పాట్టు