వేటూరి ప్రభాకరశాస్త్రి
365
దేవునకర్పితముగా నీ గ్రంథము రచియించినాఁడు. కృతిపతి వెలసియున్న యీవనిగ్రామము గుంటూరు మండలమున తెనాలి తాలూకాలోనున్నది. ఈ గ్రంథమునకు,
కృతికర్త
కృష్ణమాచార్యుఁడు. ఈతని నివాసగ్రామ మేదో తెలియరాదు. ఈ ధనుర్విద్యా విలాసమునే కాక శకుంతలా పరిణయ మని మరొక ప్రబంధమును గూడ నీతఁడు రచించినాఁడు. [1]శకుంతలా పరిణయము నీతఁడు చిరుమామిళ్ళ పాపయ్య ప్రభుఁడని నామాంతరముగల వెంకటాద్రి నాయనింగారి ప్రేరణమున తిరుపతి వెంకటేశ్వరస్వామి కర్పించినాఁడు. అందా పాపయప్రభుని వంశవిస్తర మెల్ల వర్ణింపబడినది. చల్లపల్లి జమిందార్లగు నేర్లగడ్డవారికిని, ముక్త్యాల, అమరావతీ ప్రభులగు వాసిరెడ్డి వారికిని చిరుమామిళ్ళ వంశ్యులు, నాయఁడమ్మగారు, పాగోలువాస్తవ్యులుఁ చల్లపల్లి శ్రీశివరామనృపునకుఁ బిన్నతల్లిభర్తయు, ముక్త్యాల శ్రీచంద్ర మౌళీశ్వర ప్రభునకు భావుకుఁడునై వర్ధిల్లుచున్నారు. శకుంతలా పరిణయమున గ్రంథకర్త తన్ను కృష్ణకవి యనియు ధనుర్విద్యావిలాసమున గృష్ణమాచార్యుఁడనియుఁ బేర్కొన్నాఁడు. శకుంతలా పరిణయమునాఁటి యీతని వైష్ణవత ధనుర్విద్యావిలాసము నాటికి క్రమపాకము పొందినదిగాఁబోలును. పేళ్ళుమార్పును బట్టి రెండు గ్రంథములకుఁ గర్తలు వేర్వేరువారగుదురేమో యని సందేహింపరాదు. ఈ నామభేదమేకాని రెండు గ్రంథముల గద్యములు సమానముగా నున్నవి.
గద్య: “ఇది శ్రీమత్కౌసల్యానందన ప్రసాద సమాసాదిత కవితా విచిత్ర మైత్రేయసగోత్ర నృసింహగురుపుత్ర కృష్ణమాచార్య ప్రణీతంబైనఁ శకుంతలాపరిణయము.” శకుంతలాపరిణయ రచనమునకుఁ దర్వాతి రచనముఁ గాబోలును ధనుర్విద్యావిలాసము. ఇందు గద్య మించుక మార్పు చెందినది. “కౌసల్యానందనకటాక్ష వీక్షణపరంపరాసమాసాదిత" అని. కాని, రెండు గ్రంథములందును గురుస్తుతియుఁ కవి కులగోత్ర ప్రశంసయు నొక్క విధముననే యున్నవి.
- ↑ దీనిని పనప్పాకం శ్రీనివాసాచార్యులుగారు 1894లో ముద్రించిరి.