364
ధనుర్విద్యావిలాసము
ప్రకారము. 52. రథవాహోపాఖ్యానము. 53. షణ్ముఖ కుండల పద్మవరాట భుజంగచక్రపంచక లక్షణపలసూత్రంబులుపన్యసించుట. 54. దివ్యాస్త్ర ప్రయోగార్హ శరలక్షణములు. తత్పూజానిరూపణంబును, 55. అమోఘాస్త్ర సంభవము. 56. ధీయువధ. 57. దివ్యాస్త్ర గర్వప్రకారము. 58. అమోఘాస్త్రము పరంపరానుగ్రహముగా భూలోకంబునకు వచ్చుట.
వ్యూహఖండము - పంచమాశ్వాసము.
1. అక్షోహిణీసంఖ్య. 2. సమరంబులకు, బయనంబగు సేనాలక్షణంబులు. 3. భటఘోటకరిరథాదుల స్వరూపప్రకటనము. 4. అతిరథ మహారథ సమరథార్ధధరులగుణంబులు, 5. రధీజమనోజ్ఞత్వ కౌశలవిశేషంబులుగలసారథులచందము 6. ఉపసైన్యంబగు బేడుదండున దీపించు తెఱగు. 7. మిత్రవ్యూహనామనిర్దేశము. 8. మహావ్యూహంబు లొడ్డెడు విధము. 9. పోటుమానను లెక్కటి కయ్యంబులకు జోళ్ళుగట్టి పెనంగు మార్గము. 10. అసిచర్ముల యుద్ధము. 11 కుంతాయుధులసమరము. 12. మల్లరణము, 13. చక్రాయుధుల కదనము. 14. గదాధరుల సంగ్రామము 15. అశ్వ విద్వేషము 16. వారణ విరోధము 17. అర్థరథ సమరథ మహారథాతిరధికుల యుద్ధచమత్కారము. 18. అర్ధరథాదుల నైజంబుల ప్రకటనము.
కడపటి దగు ధర్మఖండ మిందు ముద్రితముగాలేదు. గాన, దాని విషయసూచి యిందు చేరలేదు. ఈ గ్రంథము ధనుశ్శాస్త్ర విషయమున సంస్కృతగ్రంథము లన్నింటిని మించినది. దీనికి మూలమగు సంస్కృత గ్రంథమేదో తెలియరాలేదు. ఇందు ధనుర్వేద గ్రంథకర్తల పేళ్లు తత్సంప్రదాయాదులు చాల జెప్పబడినవి.
కృతిపతి
ఈవని కోదండ రామస్వామి.
కృష్ణానేని తిరుమల మాణిక్యా రాయప్రభుఁడు ధనుర్విద్యా విశేషముల వివరింపఁగాఁ దదాస్థానకవి యగు కృష్ణమాచార్యుఁడు తెలుఁగున మూడాశ్వాసముల ప్రబంధముగా కృతిప్రేరకుని యిలవేల్పయిన యీవనికోదండరామ