360
ధనుర్విద్యావిలాసము
ధనుశ్శాస్త్రవిషయకములైన సంస్కృత గ్రంథముల తీరిట్లుండఁగాఁ ధనుర్విద్యావిలాసముగాక శ్రీ పాకలపాటి రాజగోపాలరాజ ప్రణీతమగు దెలుఁగున నిప్పుడు ప్రసక్త మయిన ధనుశ్శాస్త్రము ఆద్యభ్యాస పరికరవ్యూహ ధర్మఖండములని యైదుఖండములు గలిగి యనేక ధనుశ్శాస్త్ర రహస్యార్థములతో గర్భితమై కానవచ్చుచున్నది. కానియందు తుదిఖండమగు ధర్మఖండము గానరాదు. అది యెందుచేతనో ముద్రణమున కెక్కదయ్యెను. క్రీ. 1811వ సంవత్సరమున ధనుశ్శాస్త్రమును మందపాటి వెంకటపతి రాజుగారి దగ్గఱ శుశ్రూషించి నేర్చుకొనెనట. ధనుశ్శాస్త్రరహస్యార్ధములు వారికి స్వయముగ జ్ఞానదృష్టికి గోచరింపఁగా నా గ్రంథమును వారు రచించిరట. ఆ గ్రంథమున ధనుర్విద్యావిలాసములోని విషయములు చాలఁగాజేరియే యున్నవిగాని ఇంక నెన్నో విశేష విషయము లందు గలవు. దానిలోని విషయ సూచి యిట్టిది :-
ఆదిఖండము - ప్రథమాశ్వాసము
1. నిమిభూపాలుఁడు నైమిశారణ్యమున కరుగుట, 2. నీచజనకృతమగు పరిభవము. 3, నారదాగమనము 4, ధనుర్విద్యా మాహాత్మ్యము. 5. బ్రహ్మయజ్ఞమున నారాయణుఁడు హయగ్రీవుఁడై యవతరించుట. 6. వేదోపవేదములయుత్పత్తి. 7, టట్టిభబ్రాహ్మణో పాఖ్యానము. 8, నారదుఁడు దివ్యాస్త్రమంత్రములను శపించుట. 9, పారాశర్యస్తవము. 10 భారత కథాప్రకటనము. 11, పరిక్షిత్సంభవము.
ఆదిఖండము - ద్వితీయాశ్వాసము.
12, అర్జునుఁడు పరీక్షిత్తుకు విద్యాభ్యాస మాహాత్మ్యమును బోధించుట 13, అవక్రీతు చరిత్రము 14, కుమారభార్గవులు సదాశివునిభజించుట. 15 శక్తిత్రయోత్పత్తి, 16. ధనురాదిసాధన షట్కసంభవము. 17. శక్తిత్రయపూజానిరూపణము. 18. దివ్యాస్త్ర సంభవము. 19. ధనుర్విద్యాసాంప్రదాయము. 23. సిద్ధదర్శనము, 24. ఏకాదశమహాధనుర్ధర చరిత్రము 25, దిండికారకృత విద్యాలాభము.