Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/393

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

358

ధనుర్విద్యావిలాసము


వీరచింతామణి :- భగవతో వ్యాసస్యకృతిః

ఆచార్యలక్షణము, శస్త్రకర్మారంభకాలము శిష్యునికి ధనుర్ధానము వేదత్రయము ధనురాదానవిధి ధనుర్లక్షణము ధనురాచార్యులు పరశురామాదులు.


“త్రిపర్వం పంచపర్వం సప్తపర్వం ప్రకీర్తితమ్।
నవపర్వం చ కోదండం చతుర్థా యుద్దకారకమ్॥
చతుఃపర్వం చ షట్పర్వ మష్టపర్వం విసర్జయేత్।
కేషాంశ్చ భవే చ్ఛాపం వితస్తి సవసమ్మితమ్॥
పౌరుషేయం తు యచ్ఛార్‌ఙ్గం బహువత్సర శోభితమ్।
వితస్తిభి స్సార్థ షడ్బి ర్మితం సర్వార్ధ సాధనమ్"॥


ఇత్యంతమగు ధనుఃప్రమాణము గుణలక్షణములు శరలక్షణములు ఫలలక్షణములు ఫలపాయనము


"ఫలస్య పాయనం వక్ష్యే దివ్యౌషధివిలేపనైః ।
యేన దుర్భేద్యవర్మాణి భేదయే త్తరుపత్రవత్ ॥
పిప్పలీ సైంధవం కుష్ఠం గోమూత్రేణ తు పేషయేత్।
అనేన లేపయే చ్ఛస్త్రం లిప్తం చాగ్నౌ ప్రతాపయేత్॥
శిఖి గ్రీవాసువర్మాభం తప్తపీతం తదౌషధమ్।
తతస్తు విమలం తోయం పాయయే చ్ఛస్త్రముత్తమమ్” ॥


నారాచ నాళీకములు, స్థానముష్ట్యాకర్షణములు స్థానములు, ముష్టులు, వ్యాయములు, అనధ్యాయములు, శ్రమక్రియలు, లక్ష్యాస్ఖలనవిధి, శీఘ్ర సంధానము, దూరాపాతము, శీఘ్రదృఢభేదిత హీనగతులు, శుద్ధగతులు దృఢ చతుష్కము, చిత్రవిధి, బాణభాగములు, కాష్ఠఛేదనము, బిందుకము, గోలయుగళము, వేధవిధి, అస్త్రవిధి, శస్త్రవారణము, సంగ్రామవిధి, విష్ణుస్మరణము, అక్షౌహిణీ, మహాక్షౌహిణీ, వ్యూహవిశేషములు.


ముఖే రథా గజాః పృష్ఠే తత్పృష్ఠే చ పదాతయః
పార్శ్వయోశ్చ హయాః కార్యాః వ్యూహ స్సాయం విధి స్మృతః
అర్ధచంద్రం చ చక్రం చ శకటం మకరం తథా