వేటూరి ప్రభాకరశాస్త్రి
355
తొలుత బ్రహ్మ పృథుచక్రవర్తి కుపదేశించిన ధనుర్వేదమును వైశంపాయనుఁడు జనమేజయున కుపదేశించినట్లు గ్రంథావతరణిక ప్రథమాధ్యాయమున గలిదోషములు రాజనీతి మున్నగు విషయములు శత్రుపై దాడివెడలుటకుఁ బూర్వము సంసిద్ధుఁడై యుండవలసిన తీరులు గలవు.
ద్వితీయాధ్యాయమున జయప్రదములైన ధనుర్వేదోక్తములైన యాయుధములు ముక్తక ఆముక్తక ముక్తాముక్తక మంత్రముక్తకములని నాల్గు తెఱఁగులనియు ధనుర్వేద ప్రథమ పాదమున సూచితములగు ధనురాది ద్వాదశాయుధములు మొదటిరకములనియు, ద్వితీయపాదమునఁ జెప్పబడిన యిర్వదియాయుధములు రెండవ రకమనియు, తృతీయపాదమునవి మూఁడవ రకపుటాయుధములనియు నవి నలువది నాలుగనియు సోపసంహారము లనియు నేబదియై దుపసంహారాయుధములనియు.
చతుర్థపాదమున సర్వశక్తిమంతములగు నారాయుధములు ప్రతిపాదింపబడినవనియు ధనుర్వేద విషయము చెప్పబడినది.
తృతీయాధ్యాయమున ఖడ్గోత్పత్తి తద్వివరణము తెల్పబడినది.
చతుర్థ పంచమాధ్యాయములలో తొలుతటి రెండురకముల యాయుధముల వివరణమున్ను పంచమము చివర కలికాలోపయుక్తములగు భయంకరాయుధముల విషయము వర్ణింపబడినది.
షష్ఠము సైన్య విషయవివరణము, సప్తమము దండనీతిని గుఱించి, అష్టమమున రాజ్య పరిపాలనా విషయము సామాన్య ధర్మములును ప్రతిపాదింపబడినవి.
కోదండమండనము - దీనికర్త పే రెఱుఁగరాలేదు.
జ్యాకుండలిత కోదండయష్టి ర్యస్య కరే స్థితా
స్థితా తస్య కరేంభోధివేలాకుండలితా మహీ
ద్రోణభీష్మార్జునాదీనా మద్యాపివ్యాప్తభారతః
సధనుర్గుణటంకారః స్ఫారః స్ఫూర్జతి భూతలే