354
ధనుర్విద్యావిలాసము
పిపీలికావ్యూహము సేనానయము పదాతిక్రమము అశ్వక్రమము హస్తిక్రమము రథక్రమము సేనాపతికరణవిధి శిక్ష హంతవ్యాహంతవ్యోపదేశము పరిశేషప్రకరణము :- అస్త్రనామములు :- అసి, అంకుశము, అవిద్య, అసిపుత్రిక, అర్దధార, అంతర్ముఖము, ఆటీముఖము, ఆర, ఆస్తరము, ఇలి, ఇషువు, ఉత్పత్రపత్రము, ఏషణి, ఏంద్రచక్రము, కవచము, కరపత్రము, కాలచక్రము, కుఠారము, కుంతము కుఠాలిక, కుండిక, కుద్దాలము, క్రకచము, ఖేచకము, ఖగము, ఖట్వాంగము, గద, గాంధర్వము, గారుడాస్త్రము, గోశీర్షము, చక్రము, చమ్రము, చాపము, క్షురిక, జంభనము, జింభశాస్త్రము, తులాగుడ, తూణీరము, తోమరము, త్రిశూలము, త్రికూర్చక, దంతకట్వకము, దండచక్రము, దండము, దివ్యాస్త్రము, ద్రధనము, దంతశంఖు, ధర్మచక్రము, ధనుస్సు నఖశస్త్రము, నారాచము, నాళీకము, నాగపాశము, నాగాస్త్రము, నిస్త్రింశము, నందనము, పరిఘము, పట్టిసము, పరశువు, పాశుపతము, ప్రశమనము, ప్రస్వాపనము, పినాకము, ప్రామము, బాణము, వక్రము, వాసి, రరుణము, బ్రహ్మశిరము, వాయ్వస్త్రము విద్య బడిశము, బ్రహ్మాస్త్రము, బర్షణము, బ్రహ్మదండము, వేతనపత్రకము, వ్రీహిముఖము విలాపనము, వృద్ధిపత్రము, భల్లము, భింఢిపాలము, భుశుండి, మకరాస్త్రము, మండలాగ్రము, మౌష్టికము, ముసలము, మాదకి, మయూఖి, ముదిక, లఘిత్రము, లగుడము, లవిత్రము, శరము, శక్తి, శతఘ్నీ, శలాకాస్త, శూల, శస్త్రి, శరవీముఖము శార్‌ఙ్గము, శోషణము, సమ్మోహనము, సర్పాస్త్రము, సంతాపనము, సాయకము, సింహముఖము, సూచీ సూచీముఖము, సీరము స్థూణము, హయశరము, హేతి, క్షుర, క్రౌంచాస్త్రము, కుశపత్రము, శ్రేణి, దాత్రము.
శివతత్త్వరత్నాకరము :- ఇది సంధానగ్రంథము, అర్వాచీనము, కెళిది బసవరాజుచే క్రీ శ. 1697 నుండి 1715లో సంధానింపఁబడినది, ఇందు 8వ కల్లోలమున ద్వితీయ, తృతీయ, చతుర్థ తరంగములలో ధనుర్యుద్ధశాస్త్ర విషయములున్నవి.
నీతిప్రకాశిక :- దీనికే వైశంపాయననీతి యని నామాంతరము. ఇది యెనిమిదధ్యాయములు గలది.