Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/388

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వేటూరి ప్రభాకరశాస్త్రి

353

తంత్రాత్మకములునుఁగా సమర్థించినవి. అట్లే శైవవైఖానస శాక్తాద్యాగమములను శివవిష్ణుశక్తి పూజా విధానములును యజ్ఞ తంత్రాత్మకముల గావించినవి. భగవద్గీతలలో మఱింత విపులీకరణముతో జ్ఞాన తపోయజ్ఞాదికల్పనము లున్నవి.

పై విధమున భారతమునఁ బేర్కొనబడిన ధనుర్వేద గ్రంథములు గానరావుగాని మునులు క్రమంబున సంక్షిప్తరూపముగాఁ గావించిన గ్రంథము లీ క్రిందివి గానవచ్చుచున్నవి.

వశిష్ఠధనుర్వేదసంహిత

“అథైకదా విజిగీషు ర్విశ్వామిత్రో రాజర్షి ర్గురుం వశిష్ఠ మభ్యుపేత్య ప్రణమ్యో వాచ బ్రూహి భగవన్ ధనుర్విద్యాం శ్రోత్రియాయ దృఢచేతసే శిష్యాయ దుష్టశత్రువినాశాయచ త మువాచ మహర్షిర్బ్రహ్మర్షి ప్రవరో వశిష్ఠః శ్రుణు భోరాజన్ విశ్వామిత్ర ! యాం సరహస్యధనుర్విద్యాం భగవాన్ సదాశివః పరశురామా యోవాచ. తామేవ సరహస్యాం వచ్మితే హితాగోబ్రాహ్మణసాధు వేదసంరక్షణాయ చ యజుర్వేద ధర్మసమ్మితాం సంహితామ్ తత్రచతుష్టయ పాదాత్మకో ధనుర్వేదః యస్య ప్రథమే పాదే దీక్షాప్రకారః ద్వితీయే సంగ్రహః తృతీయే సిద్ధప్రయోగః చతుర్థే ప్రయోగవిధయః ధనుర్వేద విధి.” ఆచార్య లక్షణము వేధవిధి చాప ప్రమాణము, శుభచాపలక్షణము, వర్జితధనువు గుణ లక్షణములు శరలక్షణములు ఫలలక్షణములు, తత్ఫలములు శరోపరిఔషధలేపనము నారాచనాళీక శతఘ్నీ వర్ణనములు స్థానముష్ట్యాకర్షణలక్షణములు, గుణముష్టి, ధనుర్ముష్టి, సస్థానము, ధనుర్వ్యాయములు లక్ష్యములు లక్ష్యాభాసము అనధ్యాయములు శ్రమక్రియ లక్ష్యాస్ఖలనవిధి, శ్రీఘ్రుసంధానము, దూరపాతిత్వము, దృఢభేదనము, హీనగతి సమూహము బాణాలక్ష్యస్ఖలనగతి సమూహము క్షుద్రగతులు దృఢచతుష్కము చిత్రవిధి కాష్ఠచ్ఛేదనము ధావనలక్ష్యము ధావనవిధి, శబ్దవేదిత్వము ప్రత్యాగమనము అస్త్రములు వాని మంత్ర సంస్కారము పాశుపతాస్త్రము ఔషధులు ఔషధవిధి ఉపవాసము సంగ్రామవిధి రుద్రమంత్రజపము వ్యూహాదులతో యుద్ధకరణము దగ్ధవ్యూహము శకటవ్యూహము