Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/387

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

352

ధనుర్విద్యావిలాసము

కామమోక్షంబులకు సాధకంబు లయి యుండునట్లుగా నూరువేలధ్యాయంబుల నఖిల లోకహితంబగు నీతిశాస్త్రంబు రచియించి యిది లోకచరిత్ర నిర్మలీకరణంబునకుం గారణం బగునని యనుగ్రహించె, నాలోకపితామహులలాటం బున ననాది నిధనుండును, విశ్వజగత్కర్తయు, సర్వభూతాత్ముండును, సనాతనుండును నగు విరూపాక్షుండు విశాలాక్షుండను నామంబున నావిర్భవించి యాగ్రంథం బధిగమించి దాని నభ్యసించుటకు మర్త్యుల కాయుర్బుద్ధులు సాలవని యుమ్మలించి యమ్మహనీయ తంత్రంబు సంక్షేప రూపంబునఁ బదివేలధ్యాయంబుల వైశాలాక్షంబన నిర్మించె


ఆ॥ హరునివలనఁ బడసి యాశాస్త్ర మమరేంద్రుఁ
      డయిదువేలు సేసె నమరగురుఁడు
      తేటపడ నొనర్చెఁ ద్రిసహస్రకాధ్యాయ
      రూపసమ్మితముగ భూపవర్య!


దాని శుక్రుండు సహస్రాధ్యాయపరిమితంబు గావించె, మఱియు మనుష్యులశక్తి యెఱింగి మునులుక్రమంబున సంక్షిప్తరూపంబులుగా గ్రంథంబులు గావించి, రిది నీతిశాస్త్ర ప్రకారంబు " (భారతము - శాంతిపర్వము - 2. ఆశ్వాసము) మఱియు.

"విష్ణుండు దండనీతిశాస్త్రంబు సకలంబు నాంగిరసున కిచ్చె నాంగిరసుం డింద్రమరీచులకు మరీచి భృగునకు భృగుం డనేకమునులకు నిచ్చె” శాంతి 2. ఆశ్వాసమున “ ఏయజ్ఞంబులును సంగ్రామయజ్ఞంబునకు సదృశంబులుగావు వినుము వీరమస్తకరాశి వేదికగాఁ గృపాణబాణాది సాధనంబులు సమిత్సుృక్సృవంబులుగా శోణితం బాజ్యంబుగా మాంసంబు పురోడాశంబుగా వీరవ్రత దీక్షితుండు సమరాధ్వరంబు సలిపి రుధిరజల పూరయు మస్తిష్కకర్దమయుఁ గేశశైవాలయు నాంత్రఫేనయు భేరీ మండూకయు హేతిమీనయు గజకళేబరపులినయు నగు సమరపుణ్యనది నవభృథస్నానంబు సేసి మదీయలోకంబున సుశ్లోకుండై నిత్యస్థితి నత్యుదాత్త పదవిం ప్రవర్తిల్లుఁ బుణ్యతముండుటకుఁ దనువు దొఱంగ వలయునని లేదు. తెగువతోడి యనివర్తనగతియ చాలు. (శాంతి 2, ఆశ్వాసము.)

వేదములు ప్రధానముగా యజ్ఞతంత్ర ప్రతిపాదకముగా నున్నవి గాన, యుపవేదములు గూడఁ దదర్థానుసారముగా గాంధర్వాదివిద్యల యజ్ఞ