Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/386

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వేటూరి ప్రభాకరశాస్త్రి

351

న్వితం నాగబంధైర్బధ్నీయాత్. అధోత్తమా యాశ్శక్తేః ఫలాగ్రేణ శతఫల వర్ధితం గౌరవం భవతి. మధ్యమా యాస్త్వశీతిఫలం కనిష్ఠాయాః షష్టి ఫలమితి శక్తిలక్షణ ముక్తం.”

ఈ యుదాహరణధోరణి గనుగొన్న శుక్రనీతి మూలగ్రంథమంతయుఁ బ్రాకృతముననో మాగధీభాషనో గాథారూపమున రచింపఁబడి యుండునని తోచుచున్నది. పైపంక్తుల లోని యర్థచ్ఛేదమును గమనించి మాగధికి మార్చినచో సులభముగా గాథారూపము చెందుచున్నది. గాథయనఁగాఁ బ్రాకృత మాగధీ భాషలలో నార్యావృత్తము వంటిది. ఇది కందపద్యమునందలి రెండవ నాల్గవ పాదముల కొనలో రెండుమూఁడు మాత్రలు తగ్గినట్టి యొకానొక జాతిపద్యము."

శ్రీ కవిగారు పరశురామ సూత్రములు శాండిల్యభాష్యముతో గేరళదేశమునఁ గలవనిరిగాని, యవి యట్లుండుట యింతదాఁకఁ దెలియరాలేదు. అగ్నిపురాణమున 249 అధ్యాయముననుండి 252 అధ్యాయముదాఁక ధనుర్వేద వివరణమున్నది. యుక్తికల్పతరువు, అభిలషితార్ధచింతామణి, శివతత్త్వరత్నాకరము, వీరమిత్రోదయము ( ఇవి ముద్రితములు), చతుష్షష్టి కలాసంగ్రహము ననుగ్రంథములలో యుద్ధతంత్ర వివరణమున్నది, యామలాష్టక తంత్రమునఁ గవిగా రుద్ధరించిన శాస్త్రవిషయ సంగ్రహసూచీ మాత్రమున్నదిగాని, తద్వివరణములు లేవు. ఇవి గాక, వైశంపాయన నీతిప్రకాశిక, వసిష్ఠసంహిత, శివధనుర్వేదము, మనుసారము (వ్రాతప్రతిపంజాబు కేటలాగులోనున్నది ) కోదండమండనము, హరిహర చతురంగము, వీరచింతామణి, శివోక్తధనుర్వేద సంహిత, భారతాదులలోని ధనుర్వేదవిషయములు నేఁ జూచిన ముఖ్యగ్రంథములు.

భారతమున :-

విరించి - స్వామ్యమాత్య రాష్ట్రదుర్గకోశ సుహృద్బలంబులు, నాన్వీక్షకీత్రయీవార్తా దండనీతులు, నరిమిత్రో దాసీనాదిక ద్వాదశ రాజమండలంబును సంధి విగ్రహ యానాసనద్వైధీభావ సమాశ్రయంబులును మొదలుగా వలయువానికిం బ్రబోధకంబులగు నానావయవంబులుం గలిగి ధర్మార్థ