వేటూరి ప్రభాకరశాస్త్రి
347
దీక్షాభిషేక శకునమాంగల్య కరణాదికము వివరింపఁ బడియె. రెండవదియగు సంగ్రహపాదమున సకలాస్త్రశస్త్రముల సంగ్రహ విధియు మూఁడవది యగు సిద్ధిపాదమున సంగ్రహించిన యస్త్రములకుఁ బునఃపునరభ్యాసమున మంత్రదేవతానియమ జపహోమోపాసనక్రియలును విస్తరింపబడియె. మంత్రదేవత సకళ యనియు నిష్కళ యనియు నిఱుదెఱంగులం బరఁగు, అదియు చేతనావత్త్వము, ఇచ్ఛావిగ్రహత్వము, యష్టవ్యత్వము, తుష్టిమత్త్వము ఫలదాతృత్వము అను నైదుగుణములు గలదని పూజాహోమోపాసనాదుల సాధకులు నడపుదురు. షోడశోపచారములచే సిద్ధదైవత మిచ్చు ఫలదానముచే సాధకుఁడస్త్ర ప్రయోగము నొనర్చుట నాల్గవ పాదమున విస్తరింపబడియె. శస్త్రగ్రహణమునకు ధనుర్వేదమున నియమముగలదు. సామదానభేదములచే నసాధ్యుఁడయి దుర్వినీతుఁడగు పురుషునిఁ గాని, బహుప్రజా సంరక్షణార్ధము తత్పాలకునిఁగాని, దేశకాలావస్థోచితముగాఁ గర్తృకరణ శక్తి కనుగుణముగా నాపత్కాలమునను, సర్వదా ధర్మరక్షణమునను, దండము విధేయమని శాస్త్రజ్ఞులు గ్రహించిరి.
ఈ ధనుర్వేదమున ముక్తాముక్తాది చతుర్భేదకములుగాక నియుద్ధమని పంచమభేదమును దరువాతి శాస్త్రజ్ఞులు గ్రహించిరి. తద్భేదములన్నియు మల్లయుద్ధములలోఁ బ్రయోగింపఁ బడునని నాచనసోమనాథాదులు యుద్ధప్రక్రియల నుత్తరహరివంశాదుల వర్ణించియుండుట యెల్లరకు విదితమేగదా!
ధనుర్వేద దైవత మంత్రస్వరూపముల వైశంపాయనుఁడు తన నీతి ప్రకాశికలో నిట్లు వర్ణించుచున్నాడు.
"చతుష్పాచ్చ ధనుర్వేదో రక్తవర్ణశ్చతుర్ముఖః।
అష్టబహుస్త్రి ణేత్రశ్చ సాంఖ్యాయనస గోత్రవాన్ ॥
వజ్రం ఖడ్గో ధనుశ్చక్రం దక్షిణే భుజమండలే ।
శతఘ్నీ చ గదా శూలం పట్టిసం వామబాహుషు ॥
ప్రయోగ కోటీరయుతో నిత్యాంగో మంత్రకంచుకః ।
ఉపసంహారహృదయః శస్త్రాస్త్రోభయ కుండలః ॥
అనేక వల్గితాకార భూషణః పింగళేక్షణః I